Fake News, Telugu
 

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది

0

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దు అయినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. జిల్లాకు సంబంధించి మండలాల వారిగా ఏయే మండలంలో ఎన్ని రేషన్ కార్డులు రద్దు అయ్యాయో అన్న వివరాలు కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దు అయ్యాయి.

ఫాక్ట్(నిజం): రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసారు. 2016లో మేడ్చల్ జిల్లాలో రద్దయిన రేషన్ కార్డులకు సంబంధించి వార్తా కథనాలు ఇవే గణాంకాలను ప్రచురించాయి. దీన్నిబట్టి గతంలో మేడ్చల్ జిల్లాలో రద్దయిన రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తిరిగి షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దు అయినట్టు Way2News సంస్థ ఒక వార్తను ప్రచురించింది. దీనివల్ల ఈ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రేషన్ కార్డులు రద్దు అయినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని, తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని స్పష్టం చేసారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ చూడొచ్చు.

ప్రభుత్వ స్పష్టత అనంతరం Way2News కూడా ముందు ప్రచురించిన వార్తను తొలగించింది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2016లో మేడ్చల్ జిల్లాలో రద్దయిన రేషన్ కార్డులకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2022లో తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలణ జరిగింది. ఈ వార్తను ప్రచురించిన కథనాలు గతంలో రద్దయిన రేషన్ కార్డులకు సంబంధించి ఇవే గణాంకాలను ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). దీన్నిబట్టి 2016లో మేడ్చల్ జిల్లాలో రద్దయిన రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తిరిగి షేర్ చేస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll