Fake News, Telugu
 

బురఖా ధరించి ఉన్న ఈ ముస్లిం మహిళను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఒకరోజు DSPగా మాత్రమే బుల్ధాన జిల్లా కలెక్టర్ నియమించారు

0

ఉర్దూ మీడియంలో చదివి SP (సూపరింటెండెంట్ అఫ్ పోలీస్) అయిన మొట్టమొదటి ముస్లిం మహిళ, బురఖా ధరించి విధులకు హజారైనట్టు క్లెయిమ్ చేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉర్దూ మీడియంలో చదివి SP అయిన మొట్టమొదటి ముస్లిం మహిళ, బురఖా ధరించి విధులకి హాజరయ్యారు.

ఫాక్ట్ (నిజం): బురఖా ధరించి పోలీసుల ముందు కూర్చున్న ఫోటోలోని ఆ ముస్లిం మహిళ SP కాదు. 2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఉర్దూ పాఠశాలలో చదువుతున్న సహరీష్ కన్వల్ అనే ముస్లిం మహిళను ఒక్కరోజు DSP ( డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్) గా బుల్ధాన జిల్లా కలెక్టర్ నియమించారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ‘Times of India’ వారు ‘5 మార్చ్ 2020’ నాడు తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ఫోటోకి సంబంధించిన వివరాలు దొరికాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలో చోటుచేసుకునట్టు ఆ వీడియో ఆధారంగా తెలిసింది. 2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా, ఉర్దూ పాఠశాలలో చదువుతున్న సహరీష్ కన్వల్ అనే ముస్లిం మహిళను ఒక్కరోజు DSP (డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్) గా బుల్ధాన జిల్లా కలెక్టర్ సుమన్ చంద్ర నియమించినట్టు ఆ వీడియోలో తెలిపారు.

పోస్టులోని అదే ఫోటోని షేర్ చేస్తూ ‘దేశ్ దూత్’ వార్త సంస్థ వారు రాసిన ఆర్టికల్ లో కూడా సహరీష్ కన్వల్ అనే ముస్లిం మహిళను ఒక్కరోజు DSPగా బుల్ధాన జిల్లా కలెక్టర్ నియమించినట్టు తెలిపారు. ఈ ఆధారాలతో పోస్టులో చూపిస్తున్న ముస్లిం మహిళ  ఒక్కరోజు మాత్రమే DSPగా విధులు నిర్వహించినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఫోటోలో బురుఖా ధరించి ఉన్న ముస్లిం మహిళను అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ఒకరోజు DSPగా బుల్ధాన జిల్లా కలెక్టర్ నియమించారు.

Share.

About Author

Comments are closed.

scroll