Fake News, Telugu
 

ఒసామా బిన్ లాడెన్ ని చంపినందుకు అమెరికన్ CIA క్షమాపణ చెప్పలేదు

0

‘అమెరికన్ ట్విన్ టవర్స్ 9/11 పేలుళ్లతో లాడెన్ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి, అమెరికా క్షమాపణ చెప్పిందంటున్న’ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 9/11 ట్విన్ టవర్స్ పేలుళ్లతో లాడెన్ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి, అమెరికా క్షమాపణ చెప్పింది.

ఫాక్ట్ (నిజం): 9/11 పేలుళ్ళలో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తేలడం వల్ల CIA క్షమాపణ చెప్పిందన్న వాదన నిజం కాదు. ‘ది ఆనియన్’ అనే ఒక సెటైరికల్ వెబ్సైటులో వ్యంగ్యంగా రాసిన కథనం ఆధారంగా ఈ వార్తని షేర్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని తేలితే, ఈ విషయాన్ని అన్ని వార్తా సంస్థలు ప్రచురించేవి, కాని దీనికి సంబంధించి మాకు ఎటువంటి కథనాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అమెరికాలోని ట్విన్ టవర్స్ పేలుళ్లతో ఒసామా బిన్ లాడెన్ కి ఎటువంటి సంబంధం లేదని అమెరికా క్షమాపణ చెప్పలేదు. పోస్టులో చెప్తున్నట్టు ట్విన్ టవర్స్ పేలుళ్ళలో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని ఆధారాలు లభించడంతో CIA క్షమాపణ చెప్పిందని ది ఆనియన్ అనే ఒక వెబ్సైటులో రాసిన కథనం నుండి సేకరించిన సమాచారం  ఆధారంగా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేసారు.

ఐతే ‘ది ఆనియన్’ అనేది ఒక సెటైరికల్ వెబ్సైటు. ఈ కథనం కూడా వ్యంగ్యంగా రాసిందే. కాబట్టి  9/11 పేలుళ్ళలో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తేలడం వల్ల CIA క్షమాపణ చెప్పిందన్న వాదన నిజం కాదు. లాడెన్ మరణానికి సంబంధించి CIA వెబ్సైటులో ఉన్న 9/11 కమిషన్ రిపోర్ట్ ని ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ నిజంగానే 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని తేలితే, ఈ విషయాన్ని అన్ని వార్తా సంస్థలు ప్రచురించేవి, కాని దీనికి సంబంధించి మాకు ఎటువంటి కథనాలు దొరకలేదు.

ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా సైన్యం చంపి 02 మే 2021 నాటికి పది సంవత్సరాలు అయిన సందర్భంలో అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఆ ఆపరేషన్ లో పాల్గొన్న అమెరికన్ సైనికులను మరియు అప్పటి ప్రెసిడెంట్ ఒబామాను పొగిడాడు. లాడెన్ ని చంపడాన్ని అమెరికా సమర్ధించుకుందే తప్ప ఏనాడూ క్షమాపణ చెప్పలేదు. లాడెన్ ని అమెరికన్ ఆర్మీ చంపిన తరవాత అప్పటి అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఒసామా బిన్ లాడెన్ ని చంపినందుకు అమెరికన్ CIA క్షమాపణ చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll