కెనడా లో మతం మారనందుకు వందలాది మంది చిన్నపిల్లల్ని చంపిన కాథలిక్ చర్చిల దుర్మార్గం బయటికి వచ్చాక ఆగ్రహం తో చర్చీలకి నిప్పుపెడుతున్న ప్రజలు అని ఒక ఫోటోతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల కెనడా లో చర్చి లకు ప్రజలు నిప్పు పెట్టిన ఫోటో.
ఫాక్ట్: ఈ ఫోటో 2014 లో తీసింది, ఇప్పటిది కాదు. టొరంటోలోని బ్రాంప్టన్ లోని ఉక్రేనియన్ క్యాథలిక్ చర్చి 2014 లో నిప్పులకు ధ్వంసం అయింది. ఈ ఫోటో ఆ చర్చికు సంబంధించినదే. కెనడా అంతటా ఇటీవల చర్చి దహనకాండ జరిగింది. స్వదేశీ స౦స్కరణ కోస౦ మాజీ బోర్డింగ్ పాఠశాలల భూమిలో 1,000 కు పైగా గుర్తుతెలియని సమాధులు కనుగొనబడిన తర్వాత రెండు వారాల్లో ఏడు చర్చిలు కాల్చివేసారు. కానీ, పోస్టులో ఫోటోకు ప్రస్థుత కెనడా పరిస్థితులకు సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక న్యూస్ ఆర్టికల్ లో ఈ ఫోటో లభించింది. టొరంటో లోని బ్రాంప్టన్ లోని ఉక్రేనియన్ క్యాథలిక్ చర్చిని బేస్మెంట్ లో మొదలైన మంటలు పూర్తిగా నాశనం చేశాయని 05 ఏప్రిల్ 2014 లో పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ లో తెలుస్తుంది. 1995 లో ఈ ఉక్రేనియన్ క్యాథలిక్ చర్చిని కట్టారని, అక్కడ ఉన్న పారిష్ కమ్యూనిటీకి ఇది ఎంతగానో ఇష్టమైన చర్చి అని ఆర్టికల్ లో తెలిపారు. బ్రాంప్టన్ లో జరిగిన ఈ సంఘటన గురించి ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
2014 లో బ్రాంప్టన్ చర్చిని నాశనం చేసిన మంటలు ఒక ఆక్సిడెంట్ గా తీర్పు ఇవ్వబడ్డాయి అని, దానికి కారణం ఇంకా కచ్చితంగా తెలియనప్పటికీ, ఇన్వెస్టిగేషన్ అపివేసరని, బ్రాంప్టన్ ఫైర్ డిప్యూటీ చీఫ్ బ్రియాన్ మాల్ట్బీ తెలిపారు. “100 శాతం ఖచ్చితంగా” ఎలాంటి ఫౌల్ ప్లే లేదని, ముందు రోజు రాత్రి ఒక సేవ నుండి మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
2014లో ఉక్రేనియన్ క్యాథలిక్ చర్చి అగ్ని ప్రమాదం తరువాత, బ్రాంప్టన్ చర్చి ఇప్పుడు తిరిగి తెరవబడింది అని, రెండు సంవత్సరాల తరువాత దానిని ప్రారంభించినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
ఇటీవల కెనడా అంతటా చర్చి దహనకాండ జరిగింది. స్వదేశీ స౦స్కరణ కోస౦ మాజీ బోర్డింగ్ పాఠశాలల భూమిలో 1,000 కు పైగా గుర్తుతెలియని సమాధులు కనుగొనబడిన తర్వాత రెండు వారాల్లోపు ఏడు చర్చిలు కాల్చివేసారు. కెనడా అంతటా 1880 నుండి 1990 వరకు ఇందిజినస్ చిల్ద్రెన్ పట్ల వ్యవహరించిన తీరును వివరించడానికి “సాంస్కృతిక మారణహోమం” అనే పదం ఉపయోగించబడింది. 110 స౦వత్సరాలకు పైగా, దాదాపు 1,50,000 మ౦ది ఇందిజినస్ చిల్ద్రెన్ ను బోర్డింగ్ పాఠశాలలకు ప౦పి౦చారు. వారి భాష, స౦స్కృతిని మార్చడానికి, ఈ ప్రక్రియలో భయానకభావోద్వేగ, శారీరక, లై౦గిక వేధింపులను ఎదుర్కొన్నారని, ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ కమీషన్ నివేదిక లో తేలినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. కెనడా లోని ఈ ఘటనలకు సంబంధించి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ఆర్టికల్స్ చూడొచ్చు. అయితే పోస్ట్ లోని ఫొటోకు కెనడా లోని ఈ ఘటనలకు సంబంధం లేదు.
చివరగా, పాత ఫోటో చూపించి ప్రస్తుతం కెనడా లో చర్చిల పరిస్థితిగా షేర్ చేస్తున్నారు.