Fake News, Telugu
 

వీడియో గేమ్ దృశ్యాలని షేర్ చేస్తూ ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక టెక్నాలజీ పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటున్నారు

0

ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక టెక్నాలజీ పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. పాలస్తీనా-ఇజ్రాయిల్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక టెక్నాలజీ, పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో షేర్ చేసింది Arma 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి రూపొందించిన సిములేషన్ వీడియో అని తెలిసింది. ఈ వీడియోకి ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి నిరోధక టెక్నాలజీకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Compared Comparison’ అనే యూట్యూబ్ ఛానెల్ 22 జూలై 2020 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని  “ArmA 3 – Counter-Rocket Artillery Mortar System in Action – Shooting Down Jets – Phalanx CIWS – Sim” అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. ARMA 3 అనే వీడియో గేమింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిములేషన్ వీడియోని రూపొందించినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ‘Compared Comparison’ యూట్యూబ్ ఛానెల్, ‘ARMA 3’ వీడియో గేమ్ అప్లికేషన్ ని ఉపయోగించి ఆధునిక రియాలిటీ వార్ చిత్రాలని రూపొందిస్తుందని తమ ప్రొఫైల్ లో తెలిపారు.

ARMA 3 అనేది వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగించి రూపొందించిన ఒక మిలిటరీ వీడియో గేమ్. ARMA 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ ద్వార రూపొందించిన మరికొన్ని వీడియోలని కూడా ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి నిరోధక టెక్నాలజీకి ముడిపెడుతూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వీడియోలకి సంబంధించి FACTLY పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న తాజా ఘర్షణలకి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, వీడియో గేమ్ దృశ్యాలని చూపిస్తూ ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక టెక్నాలజీ పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll