Fake News, Telugu
 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, 1999లో జరిగిన గ్రాహం స్టెయిన్స్, అతని ఇద్దరు కుమారుల హత్యకు సంబంధంలేదు

0

మిస్టర్ స్టెయిన్స్, నిద్రిస్తున్న వాహనానికి నిప్పంటించి మీ ఇద్దరు కుమారులు ఫిలిప్ (10) మరియు తిమోతి (09)ని చంపిన అప్పటి గ్రామ కౌన్సిలర్ ఈ రోజు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1999లో గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారులను చంపిన అప్పటి గ్రామ కౌన్సిలరే ఈ రోజు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ఫాక్ట్: ఒరిస్సాలోని కియోంజర్ జిల్లాలో ఉన్న మనోహర్‌పూర్ అనే గ్రామంలో గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారులు నిద్రిస్తున్న వాహనానికి నిప్పంటించి దుండగలు చంపారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ గ్రామానికి కౌన్సిలర్‌గా పనిచేయలేదు. 1997లో తను కౌన్సిలర్‌గా గెలిచింది మయూర్‌భంజ్‌ జిల్లాలోని రైరంగ్‌పూర్‌ లో. అంతేకాదు, గ్రాహం స్టెయిన్స్ మరియు అతనికి ఇద్దరు కుమారుల హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా ద్రౌపది ముర్ము పేరు లేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, 1999లో గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారులను నిద్రిస్తున్న వాహనానికి నిప్పంటించి దుండగలు చంపింది ఒరిస్సాలోని కియోంజర్ జిల్లాలో ఉన్న మనోహర్‌పూర్ అనే గ్రామంలో అని తెలిసింది. ఆ కేసుకు సంబంధించి 2011లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చదవచ్చు.

అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ గ్రామానికి కౌన్సిలర్‌గా పనిచేయలేదు. 1997లో తను కౌన్సిలర్‌గా గెలిచింది మయూర్‌భంజ్‌ జిల్లాలోని రైరంగ్‌పూర్‌ లో. అంతేకాదు, గ్రాహం స్టెయిన్స్ మరియు అతనికి ఇద్దరు కుమారుల హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎక్కడా కూడా ద్రౌపది ముర్ము పేరు లేదు.

2004లో తను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో కూడా తన మీద ఎటువంటి హత్య కేసులు లేవని ద్రౌపది ముర్ము తెలిపినట్టు చూడవచ్చు.

చివరగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, 1999లో జరిగిన గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారుల హత్యకు సంబంధంలేదు. ఆ హత్య జరిగిన గ్రామానికి ద్రౌపది ముర్ము కౌన్సిలర్‌గా పనిచేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll