Fake News, Telugu
 

‘తెలుగుదేశం పార్టీ’ అవినీతికరమైన రాజకీయ పార్టీ అంటూ BBC సంస్థ వారు ఎటువంటి సర్వే ప్రచురించలేదు

0

‘BBC సంస్థ ప్రచురించిన అత్యంత అవినీతికరమైన రాజకీయ పార్టీల జాబితాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాలుగవ స్థానంలో ఉంది’ అంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో చెప్పింది ఎంతవరకు నిజమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: BBC సంస్థ ప్రచురించిన ‘ప్రపంచంలోని అగ్ర పది అవినీతి రాజకీయ పార్టీలు – 2017’ జాబితాలో ‘తెలుగుదేశం పార్టీ’ ఉంది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టిన జాబితా అసలు BBC వారు ప్రచురించలేదు. BBC News Hub అనే ఒక మోసపూరిత వెబ్సైట్ ప్రచురించిన జాబితాని ఫోటోషాప్ చేసి, అందులో ‘తెలుగుదేశం పార్టీ’ పేరుని చేర్చారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

గూగుల్ సెర్చ్ లో “Top 10 corrupt political parties 2017 list” అని వెతికినప్పుడు, ‘BBC News Hub’ ప్రచురించిన జాబితాకి సంబంధించిన ఆర్టికల్ లభించింది. ఆ జాబితాలో మరియు పోస్ట్ లో ఉన్న జాబితాలో ‘తెలుగుదేశం పార్టీ’ పేరు తప్ప మిగతావన్నీ ఉన్నట్లుగా చూడవచ్చు. ‘BBC News Hub’ అనేది ఒక న్యూస్ వెబ్సైటు, దానికి ‘BBC News’ కి ఎటువంటి సంబంధం లేదు.

మన దేశం లోని అనేక రాజకీయ పార్టీలు ‘BBC News Hub’ జాబితాలో తమ ప్రతిపక్షాల పేర్లను చేర్చి వాటిపై దుష్ప్రచారం చేసినట్టుగా క్రింద చూడవచ్చు.

గతంలో, YSR కాంగ్రెస్ అవినీతి రాజకీయ పార్టీ అంటూ BBC సంస్థ జాబితా వెల్లడించిందంటూ కూడా వార్తలు చలామణీ అయినప్పుడు, అది తప్పంటూ ‘FACTLY’ వారు ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, అసలు BBC సంస్థ ఎటువంటి సర్వే ప్రచురించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll