Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘70 వేలమందికి కొరోనా వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది’ అని తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ వ్యాఖ్యలు చేయలేదు

0

ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా సమావేశంలో తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ మాట్లాడిన ఆడియో క్లిప్ అంటూ రిపబ్లిక్ టీవీ టెలికాస్ట్ చేసిన న్యూస్ వీడియోని పెట్టి, ‘70 వేలమందికి ఈ వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది.మన స్వాధీనంలోనికి వస్తుంది’ అని మౌలానా సాద్ అన్నట్టు ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్: ‘70 వేలమందికి కొరోనా వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది. మన స్వాధీనంలోనికి వస్తుంది’.

ఫాక్ట్ (నిజం): తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ మాట్లాడిన ఆడియో క్లిప్ అంటూ రిపబ్లిక్ టీవీ టెలికాస్ట్ చేసిన ఆడియోలో ఎక్కడా కూడా పోస్టులో చెప్పినట్టు ‘70 వేలమందికి కొరోనా వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది’ అని అనలేదు. అంతేకాదు, ఆ ఆడియో లో మాట్లాడింది మౌలానా సాద్ అని తాము కచ్చితంగా చెప్పలేమని రిపబ్లిక్ టీవీ వారు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో పెట్టిన వీడియోని, రిపబ్లిక్ టీవీ వారి వెబ్సైటులో కూడా చూడవొచ్చు. వెబ్సైటులో పెట్టిన వీడియోలో మొదట్లోనే ఆ ఆడియో లో మాట్లాడింది మౌలానా సాద్ అని తాము కచ్చితంగా చెప్పలేమని రిపబ్లిక్ టీవీ వారు తెలిపారు. ఒకవేల, ఆడియో లో మాట్లాడింది తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అని అనుకున్నా, ఆ ఆడియోలో ఎక్కడా కూడా పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు (‘70 వేలమందికి ఈ వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది.మన స్వాధీనంలోనికి వస్తుంది’) చేయలేదు. ‘డాక్టర్లు చెప్పింది వినడానికి మరియు ప్రార్థనలను వదులుకోవడానికి ఇది సమయం కాదు. ఒకరినొకరు కలుసుకోండి, అల్లా ని ప్రార్థించండి’ అని లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆడియోలో మాట్లాడినట్టు వినవొచ్చు. 70 వేలమందిని డాక్టర్లు కాపాడలేకపోయారు అని ఆడియోలో అంటాడు, 70 వేలమందికి ఈ వ్యాధిని అంటించమని చెప్పడు.

చివరగా, ‘70 వేలమందికి కొరోనా వ్యాధిని అంటించగలిగితే భారత్ నాశనమౌతుంది’ అని తబ్లీక్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ వ్యాఖ్యలు చేయలేదు .

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll