Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని వాడి కంగనా రనౌత్ గూగుల్ లో ఉన్న ఒక రెసిపి ఫోటోని తను తయారు చేసినట్టు షేర్ చేస్తుందంటున్నారు

0

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గూగుల్ లో ఉన్న ఒక రెసిపీ ఫోటోని షేర్ చేసి తను వండి తయారు చేసిన వంటగా ట్వీట్ చేసినట్టు ఒక పోస్ట్ సోషల్ మీడియా లో షేర్ అవుతుంది. కంగనా రనౌత్ ఈ ఫోటోని 04 మార్చి 2021 నాడు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే, Kuvings అనే కిచెన్ వెర్ వెబ్సైటులోని Spring Acai Bowl రెసిపీ యొక్క ఫోటోని కంగనా రనౌత్ తన వంటకంగా షేర్ చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గూగుల్ లో ఉన్న రెసిపీ ఫోటోని షేర్ చేసి తను తయారు చేసిన వంటగా కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.

ఫాక్ట్ (నిజం): బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన రెసిపి ఫోటో, ‘Kuvings’ కిచెన్ వెర్ వెబ్సైటులోని ‘Spring Acai Bowl’ రెసిపీ ఒకటి కాదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం ‘Kuvings’ కిచెన్ వెర్ వెబ్సైటులో వెతికితే,  ‘Spring Acai Bowl’ రెసిపీ యొక్క ఫోటో లభించింది.  ఈ వెబ్సైటులోని ‘Spring Acai Bowl’ రెసిపీ ఫోటో, కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటో ఒకటి కాదు. కంగనా రనౌత్ షేర్ చేసిన రెసిపీ ఫోటో ఈ వెబ్సైటులో ఎక్కడా లభించలేదు.

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో కనిపిస్తున్న ‘Spring Acai Bowl’ రెసిపీ టెక్స్ట్ ని కంగనా రనౌత్ షేర్ చేసిన ఫోటో పై మార్ఫ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు, కంగనా తన వంటకు సంబంధించి షేర్ చేసిన మరొక ఫోటోలో, ఆ రెసిపీని తను చేతిలో పట్టుకోవడాన్ని మనం చూడవచ్చు.

సోషల్ మీడియాలో తన వంటకానికి సంబంధించి షేర్ అవుతున్న ఈ ఎడిటెడ్ ఫోటో గురించి కంగనా రనౌత్ ట్విట్టర్లో స్పందించింది. ఒక ఎడిటెడ్ ఫోటోని చూపిస్తూ తన వంటకం పై మీమ్స్ రుపొందిస్తునట్టు కంగనా రనౌత్ తెలిపింది. అంతేకాదు, తన రెసిపి ఉంచిన టేబుల్ ఫోటోని కంగనా రనౌత్ మరొక ట్విట్ లో షేర్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది మార్ఫ్ చేయబడిన ఫోటో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ కంగనా రనౌత్ గూగుల్ లో ఉన్న ఒక రెసిపి ఫోటోని తను తయారు చేసిన వంటగా షేర్ చేస్తుదంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll