Fake News, Telugu
 

కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాతె, బీజేపీ ప్రభుత్వం గంగాజలాన్ని GST నుండి మినహాయించలేదు అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు

0


కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతె  మాట్లాడుతున్న వీడియోను పోస్టు చేస్తూ తాను హిందువుల పూజా సామగ్రి పై GST ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతె  హిందువుల పూజా సామగ్రి పై GST ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో సుప్రియా శ్రీనాతె ,సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ మరియు కస్టమ్స్ వారి లేఖను చూపిస్తూ,  అందులో రుద్రాక్ష మాల, యజ్ఞోపవితమ్, విభూతి, రోలీ మరియు చందనం వంటి 10 పూజకు సంబంధించిన వస్తువులను GST పన్ను నుండి మినహాయించగా,  గంగాజలాన్ని GST నుండి మినహాయించిన వస్తువుగా బీజేపీ ప్రభుత్వం చేర్చలేదు అని ఆరోపించారు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, సుప్రియ శశ్రీనాతే  ఇటీవల విలేకరుల సమావేశంలో, గంగాజలంపై GSTని తొలగించాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరుతున్నట్లు స్పష్టం చేసారు. ఈ  వీడియోను  కాంగ్రెస్ పార్టీ వెబ్సైటులో మరియు యూట్యూబ్ ఛానెల్లో ప్రచురించడం గమనించాం.

ఈ వీడియోలో సుప్రియా, “హిందూ ధర్మానికి తమను తాము ‘తేకేదార్’ (ప్రకటిత సంరక్షకులు)గా భావించే వారు గంగాజల్‌పై పన్ను విధిస్తున్నారు” అని,  ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ మరియు కస్టమ్స్ యొక్క లేఖను చూపిస్తూ,  అందులో “రుద్రాక్ష మాల, యజ్ఞోపవితమ్, విభూతి, రోలీ మరియు చందనం వంటి 10 పూజకు సంబంధించిన వస్తువులను GST పన్ను నుండి మినహాయించగా,  గంగాజలాన్ని GST నుండి మినహాయించిన వస్తువుగా చేర్చలేదు, కాంగ్రెస్ ఈ అంశాన్ని బయటపెట్టినప్పుడు మాత్రమే వారు ఈ పన్నును తొలగించారు మరియు దీనికి వివిధ పత్రాలు మరియు ప్రకటనలు ఆధారాలుగా ఉన్నాయి” అంటూ ఆరోపించారు. 

ఈ ప్రెస్ మీట్ గురించి పలు న్యూస్ రిపోర్ట్స్ కూడా ప్రచురించబడ్డాయి (ఇక్కడ మరియు ఇక్కడ) అని గమనించాం.

దీని గురించి మరింత వెతకగా, సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ ప్రెస్ మీట్ కంటే ముందు X పోస్ట్ ద్వారా గంగాజలాన్ని GST నుండి మినహాయిస్తున్నట్టు తెలపడం గమనించాం. 

చివరిగా, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనాతె, బీజేపీ ప్రభుత్వం గంగాజలాన్ని GST నుండి మినహాయించలేదు అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll