ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘నాగ సాధువు పై పైశాచికంగా దాడి చేసిన ముస్లింలు’ అని దాని గురించి పేర్కొంటున్నారు. ఆ వీడియోలో నగ్నంగా ఉన్న వ్యక్తిని ఒక యువకుడు కర్రతో కొడుతూంటే చుట్టూ ఉన్న జనం చూస్తుంటారు. అయితే, ఆ వీడియో గురించి పోస్టులో చెప్పింది తప్పని FACTLY విశ్లేషణలో తేలింది. వీడియోలో దెబ్బలు తిన్న వ్యక్తి పేరు ‘సోమనాథ్’; అతను డెహ్రాడున్ లో వృత్తిరిత్యా పాములను ఆడించేవాడని పోలీసులు తెలిపారు. సోమనాథ్ నాగ సాధువు వేషంలో బిక్షాటనకి వెళ్లి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె సోదరుడు ‘శుభం’ అతన్ని కొట్టాడని 2018 లోనే పోలీసువారు ట్వీట్ చేసారు. కావున, వీడియో లో దెబ్బలు తిన్న వ్యక్తి ‘నాగ సాధువు’ కాదు మరియు కొట్టింది ‘ముస్లింలు’ కాదు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. డెహ్రాడున్ పోలీస్ ట్వీట్ – https://twitter.com/DehradunSsp/status/1035195417758056449
2. డెహ్రాడున్ పోలీస్ ట్వీట్ – https://twitter.com/DehradunSsp/status/1036204730781917189
Did you watch our new video?