Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

మహారాష్ట్రలో టమాటో పంటలకు వచ్చిన తిరంగ వైరస్ కి కరోనావైరస్ కి ఏ సంబంధం లేదు, అది మనుషులకు హానికరం కూడా కాదు

0

ఒక  కొత్త వైరస్ టమాటాలలో  కనుక్కోబడిందని ‘TV9 భారత్ వర్ష్’ వారు టెలికాస్ట్ చేసిన ఒక న్యూస్ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఆ వీడియో లో న్యూస్ రీడర్ ‘తిరంగ వైరస్’ ఒక  కొత్త రకం కరోనావైరస్ అని, అది మహారాష్ట్ర లోని టమాటోల్లో కనిపించిందని చెప్పడం చూడవచ్చు. ఆ న్యూస్ వీడియోలో తిరంగా వైరస్, కరోనావైరస్ కంటే ప్రమాదం అని మరియు అది మనుషులకు హాని చేస్తుందని ఉంది ఈ క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో చూద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: టమాటో లలో కనిపించిన ‘తిరంగ వైరస్’, కరోనావైరస్ యొక్క కొత్త వెర్షన్, మానవులకు హానికరం. 

ఫాక్ట్ (నిజం): ‘TV9 భారత్ వర్ష్’ వేరే వీడియో లో టమాటో లకి కరోనావైరస్ కి సంబంధం ఉందని తాము ఎలాంటి క్లెయిమ్ చేయట్లేదని స్పష్టం చేసింది. అంతేకాక, ఆ కొత్త వైరస్ మానవులకు హానికరం కాదని కూడా స్పష్టం చేసింది. ఒక వ్యాధి/వైరస్ (తిరంగ వైరస్) మహారాష్ట్ర లోని టమాటో పంటల పై ప్రభావం చూపడం నిజం అయినప్పటికీ ఆ వైరస్ మానవులకు హానికరం అని కానీ మరియు ఆ వైరస్ కు కరోనావైరస్ కు సంబంధం ఉందని చెబుతున్న క్లెయిమ్ లకు ఎలాంటి ఆధారం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

‘TV9 భారత్ వర్ష్’ ఛానల్ వారు ‘తిరంగ వైరస్’ గురించి టెలికాస్ట్ చేసిన వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతికితే 13 మే 2020 న ప్రసారం చేసిన వీడియో (పోస్ట్ లో ఉన్న వీడియో) తప్పని వివరణ ఇస్తూ 15 మే 2020 న వారు ప్రసారం చేసిన వేరే వీడియో కనిపించింది. ఆ వీడియోలో టమాటోలకి  కరోనావైరస్ కి సంబంధం ఉందని తాము ఎలాంటి క్లెయిమ్ చేయట్లేదని స్పష్టం చేసారు. అంతేకాక, ఆ కొత్త వైరస్ మనుషులకు సోకుతుందన్న క్లెయిమ్ తప్పని స్పష్టం చేసారు. తాము ప్రసారం చేసిన మొదటి వీడియో లో అలాంటి క్లెయిమ్ లు ఏవీ చేయలేదని ఆ ఛానల్  వాళ్ళు చెప్పినప్పటికీ, ఆ క్లెయిమ్ లని ఆ పాత వీడియో లో స్పష్టంగా చూడవచ్చు. 

‘TV9 భారత్ వర్ష్’ ఛానల్ వారు ప్రసారం చేసిన మొదటి వీడియో లోని క్లెయిమ్ లలో నిజం లేదని వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ న్యూస్ పోర్టల్ లు కూడా స్పష్టం చేసాయి. ‘Agri News Network’ అనే ఒక వెబ్ పోర్టల్ వారి రిపోర్ట్ ప్రకారం, డాక్టర్ బి.ఎన్.ఎస్. మూర్తి (హార్టికల్చర్ కమిషనర్, వ్యవసాయ సహకారం మరియు రైతు సంక్షేమ శాఖ (DAC&FW )) TV9 కి రాసిన లెటర్ లో ఇంకా గుర్తింపబడని ఒక వ్యాధి (జాతీయ పరిశోధన సంస్థలు ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో ప్రయత్నాలు చేస్తున్నాయి) టమాటో పంటలను నాశనం చేస్తుండడం తో రైతులు బాధపడుతున్నారన్న వార్త లో కొంచం నిజం ఉన్నపటికీ, ఆ వ్యాధి సోకిన పండ్లను తింటే వచ్చే సమస్యలు కరోనావైరస్ వ్యాధితో వచ్చే సమస్యల కంటే కూడా ఎక్కువ ఉంటాయి అనే వార్త  అసంబద్ధంగా  ఉందని రాసారు. అంతేకాక, ఇప్పటి వరకు, మొక్కలకు సోకే ఏ వైరస్ కూడా మానవులకు సోకలేదని, ఎందుకంటే వాటిలో ఆ వ్యాధి సంక్రమించడానికి ఉండాల్సిన రిసెప్టర్లు లేవని చెప్పారు. తిరంగ వైరస్ పై ‘TV9 భారత్ వర్ష్’ ఇచ్చిన రిపోర్ట్ కి  సంబంధించి పృథ్వీరాజ్ చౌహాన్, MLA మరియు మహారాష్ట్ర మాజీ సిఎం, కూడా ట్వీట్ చేశారు.

టమాటా పంటలపై  ప్రభావం చూపిస్తున్న ఈ కొత్త వ్యాధి/వైరస్ (తిరంగ వైరస్ అని పిలుస్తారు) కి సంబంధించిన న్యూస్ రిపోర్ట్లని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, ఈ వ్యాధి/వైరస్ మానవులకు హానికరం అని వారు ఎవరు  రిపోర్ట్   చేయలేదు.

చివరగా, మహారాష్ట్రలో టమాటో పంటల పై ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధి కరోనావైరస్ కి సంబంధించినది కాదు. అంతేకాక, ఇది మానవులకు హానికరం కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll