“ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న యువతి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనను చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న యువతి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనను చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ 02 జనవరి 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో ఇది కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని (ఆర్కైవ్డ్) ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ 02 జనవరి 2025న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియోని కేవలం ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసం రూపొందించారని స్పష్టం చేశారు. ఇదే వివరణ మనకి ఈ వీడియో యొక్క చివర్లో కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని మనం నిర్ధారించవచ్చు. ‘3RD EYE’ పబ్లిష్ చేసిన మరిన్ని స్క్రిప్టెడ్ వీడియోలను ఇక్కడ చూడవచ్చు.
ఇంతకముందు కూడా ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు నిజమైన ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్ – చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న యువతి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలంటూ స్క్రిప్టెడ్ వీడియోను వాస్తవ ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.