Fake News, Telugu
 

స్క్రిప్టెడ్ వీడియోని రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. సూట్ కేసులో చిన్న పిల్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న ఒక వ్యక్తిని కొందరు పట్టుకొని నిలదీసిన దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోని రాజు భారతి అనే యూట్యూబర్ రూపొందించి, తన ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసాడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొందరు ఇదే క్లెయింతో ఫేస్‌బుక్ లో షేర్ చేసినప్పుడు, వీడియోలో ఎర్ర టోపీ పెట్టుకుని కనిపిస్తున్న వ్యక్తి ఒక ప్రముఖ యూట్యూబర్ అని కొందరు కామెంట్లు పెట్టినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా ఆ యూట్యూబర్ ఎవరని వెతికితే, వీడియోలో కనిపిస్తున్న ఆ ఎర్ర టోపీ పెట్టుకున్న వ్యక్తి, ‘Bharti Prank’ అనే యూట్యూబ్ ఛానల్‌ నిర్వాహకుడు రాజు భారతి అని తెలిసింది. రాజు భారతి అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌బుక్ పేజీలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కలిగిన వీడియోని రాజు భారతి 27 డిసెంబర్ 2021 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కల్పితమైనవని, కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కోసం రుపొందించినదని వివరణలో స్పష్టంగా తెలిపారు. అంతేకాదు, ఈ వీడియోలో కిడ్నాప్ చేసిన వ్యక్తి ముస్లిం అని ఎక్కడా పేర్కొనలేదు.

రాజు భారతి యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్‌బుక్ పేజీలో ఇలాంటి ప్రాంక్ మరియు స్క్రిప్టెడ్ వీడియోలు చాలా పబ్లిష్ చేసి ఉన్నాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో స్క్రిప్టెడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY ఆ పోస్టులకి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోని రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll