Fake News, Telugu
 

గత దీపావళికి జరిగిన దీపోత్సవానికి సంబంధించిన దృశ్యాలను అయోధ్యలో ఇప్పటి శ్రీరామ నవమి దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు

0

అయోధ్యలో శ్రీరామ నవమి ఏర్పాట్లు అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో శ్రీరామ నవమి ఏర్పాట్లుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు గత నవంబర్‌లో (2021 నవంబర్) దీపావళి సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవానికి సంబంధించినవి. ఈ దృశ్యాలు నవంబర్ నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండగా, పలు వార్తా కథనాలు ఇవే దృశ్యాలను నవంబర్‌లో దీపోత్సవానికి సంబంధించినవంటూ ప్రచురించాయి. ఐతే శ్రీరామ నవమికి అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగినప్పటికీ, ఈ దృశ్యాలు మాత్రం గత దీపావళికి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అయోధ్యలో నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు, వైరల్ అవుతున్న దృశ్యాలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ దృశ్యాలు గత సంవత్సరం దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవానికి సంబంధించినవి. పోస్టులో షేర్ చేసిన వీడియోలో ‘Ayodhyawale’ అనే ఒక వాటర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. దీని ఆధారంగా ఫేస్‌బుక్‌లో వెతకగా ఇదే పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ పేజీ మాకు కనిపించింది.

ఈ పేజీలో పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలకు సంబంధించిన కొన్ని షార్ట్ వీడియోస్ మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవానికి సంబంధించినవంటూ ఈ వీడియోలను గత నవంబర్‌లో షేర్ చేసారు. దీన్నిబట్టి పోస్టులో షేర్ చేసిన వీడియో, ఈ షార్ట్ వీడియోలను డిజిటల్‌గా కలిపి తాయారు చేసి ఉంటారు.

2021లో అయోధ్యలో జరిగిన దీపోత్సవానికి సంబంధించి కథనాల కోసం వెతకగా, వైరల్ అవుతున్న దృశ్యాలను ప్రచురించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాలలో దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన వీడియోలోని దృశ్యాలను పోలి ఉన్నాయి.

ఐతే అయోధ్యలో నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో మాత్రం నవంబర్ 2021 అయోధ్యలో జరిగిన దీపోత్సవానికి సంబంధించింది.

చివరగా, గత దీపావళికి జరిగిన దీపోత్సవానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పటి శ్రీరామ నవమి వంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll