Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆక్సిజన్ సిలిండర్ల బదులు నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చని చెబుతున్న ఈ వీడియో తప్పు

0

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళకుండా ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ పొందవచ్చని ఒక డాక్టర్ సూచిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఫరిదాబాద్ సర్వోదయ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న ఆలోక్ గుప్తా, కోవిడ్ పేషెంట్లని ఆక్సిజన్ సిలిండర్ల బదులు ఖాళీ నెబ్యులైజర్ మెషిన్లని ఉపయోగించి ఆక్సిజన్ పొందమని చెప్పినట్టు మరొక యూసర్ ఈ వీడియోని పోస్ట్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆక్సిజన్ సిలిండర్ల బదులు ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చు.

ఫాక్ట్ (నిజం): ఫరిదాబాద్ సర్వోదయ హాస్పిటల్ డాక్టర్ ఆలోక్ గుప్తా ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ పొందవచ్చని చేసిన ఈ వ్యాఖ్యలకి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేసారు. తను వీడియోలో తెలిపిన సమాచారం తప్పని ఒప్పుకుంటూ ఆలోక్ గుప్తా ప్రజలకి క్షమాపణ చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఈ వీడియోకి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఫరిదాబాద్ సర్వోదయ హాస్పిటల్ డాక్టర్ ఆలోక్ గుప్తా ఖాళీ నెబ్యులైజర్ మెషిన్ల  ద్వార ఆక్సిజన్ పొందవచ్చని చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేసినట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి.  

నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చని చేసిన ఈ వీడియోకి తాము ఎటువంటి ఆమోదం ఇవ్వలేదని సర్వోదయ హాస్పిటల్ ట్వీట్ చేసింది. నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సర్వోదయ హాస్పిటల్ స్పష్టం చేసింది.

ఈ వీడియోలో తెలిపిన సమాచారం తప్పని ఒప్పుకుంటూ ఆలోక్ గుప్తా మరొక వీడియోని రిలీజ్ చేసారు. తను ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా షేర్ చేయలేదని ఆలోక్ గుప్తా వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చని ఆలోక్ గుప్తా చేసిన ఈ వీడియో తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, నెబ్యులైజర్ మెషిన్ల ద్వార ఆక్సిజన్ సదుపాయం పొందవచ్చని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll