Fake News, Telugu
 

రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి హిందువులను విమర్శించినట్టు షేర్ చేస్తున్నారు

0

రాహుల్ గాంధీ, ఇటీవల తన యూరోప్ పర్యాటనలో, హిందువులు దేశాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నాడు అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాహుల్, కేవలం తన అధికారం కోసం హిందూ సమాజాన్ని క్రిమినల్స్ లాగా చూపించే ప్రయత్నం చేసాడు అని పోస్టులో చెప్పారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ‘హిందువులు దేశాన్ని నాశనం చేస్తున్నారు’ అని యూరోప్ పర్యటనలో రాహుల్ గాంధీ అన్నారు.

ఫాక్ట్: పారిస్‌లోని సైన్సెస్ PO యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీని హిందూ జాతీయవాదం పెరుగుదల గురించి ఒక వ్యక్తి అడగగా, రాహుల్ బీజేపీని విమర్శించారు, హిందువులను కాదు. కావున ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వ్యాఖ్యల గురించి కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వారం రోజుల యూరోప్ పర్యటనకు వెళ్లారని, అందులో భాగంగా, పారిస్‌లోని సైన్సెస్ PO యూనివర్శిటీలో జరిగిన సమావేశంలో ఫాకల్టీ మరియు విద్యార్థులతో సంభోదించారు అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). 

ఈ సెషన్ వీడియో ద్వారా రాహుల్ గాంధీని హిందూ జాతీయవాదం పెరుగుదల గురించి ఒక వ్యక్తి ప్రశ్నించాడు అని తెలిసింది. దానికి సమాధానంగా రాహుల్ గాంధీ,  “నేను గీత చదివాను, ఎన్నో ఉపనిషత్తులు చదివాను, ఎన్నో హిందూ పుస్తకాలు చదివాను; బీజేపీ ఏం చేస్తుందో దానిలో హిందుత్వం లేదు. మీరు మీకంటే బలహీనులను భయపెట్టాలని గానీ, హాని చెయ్యాలని గానీ ఏ హిందూ పుస్తకంలో చదవలేదు. వారు అధికారం కోసం ఏదైనా చేస్తారు, కొంతమంది వ్యక్తుల ఆధిపత్యాన్ని కోరుకుంటారు. దీనికి హిందుత్వంతో సంబంధం లేదు.” అని రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తూ జవాబు ఇచ్చారు.

చివరిగా, ఇటీవల తన యూరోప్ పర్యటనలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి హిందువులను విమర్శించినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll