Fake News, Telugu
 

ఆ వీడియో రామ మందిరంకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రశాంత్ భూషణ్‌పై దాడికి సంబంధించింది కాదు

0

న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై ఒక వ్యక్తి దాడి చేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, రామ మందిరంకి వ్యతిరేకంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడినందుకుగాను అతని పై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియో రామ మందిరంకి వ్యతిరేకంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడినందుకుగాను అతని పై జరిగిన దాడికి సంబంధించినది.

ఫాక్ట్ (నిజం): వీడియో 2011లో కాశ్మీర్ అంశానికి సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖలకు గాను ఒక వ్యక్తి అతనిపై దాడి చేసినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

యూట్యూబ్ లో ‘prashanth bhushan beaten’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో  ‘Times Now’ వారి న్యూస్ వీడియో లభించింది. అందులో ఆ ఛానల్ రిపోర్టర్ కాశ్మీర్ అంశానికి సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖలకు గాను ఒక వ్యక్తి అతనిపై దాడి చేసాడని చెప్తాడు. అదే విషయాన్ని పోస్టులో పెట్టిన వీడియోలో కూడా వినవచ్చు. ఆ ఘటన 2011లో జరిగినట్లుగా యూట్యూబ్ వీడియో యొక్క టైంస్టాంప్ ద్వారా తెలుస్తోంది.

చివరగా, ఆ వీడియో రామ మందిరంకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసినది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll