Fake News, Telugu
 

‘అయోధ్యలో ఉన్నది బాబ్రీ మసీదు కాదు….’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయలేదు

0

అయోధ్య లో ఉన్నది బాబ్రీ మసీదు కాదని, అది బాబర్ పేరుతో నిర్మించబడిన ఒక భవనం అని సుప్రీం కోర్టు చెప్పినట్టుగా ఉన్న పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సుప్రీం కోర్టు: ‘అయోధ్యలో ఉన్నది బాబ్రీ మసీదు కాదు, బాబర్ పేరుతో నిర్మించిన ఒక భవనం”.

ఫాక్ట్ (నిజం): పీ.ఎన్. మిశ్రా (‘Ram Mandir Revitalisation Committee’ తరపున వాదిస్తున్న అడ్వకేట్) సుప్రీం కోర్టు లో చేసిన వ్యాఖ్యలను తీసుకొని, ఆ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు చేసినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Babur building not masjid’ అని వెతకగా, ఈ విషయం పై ‘Hindustan Times’ మరియు ‘The Hindu’ ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఆర్టికల్స్ ద్వారా అయోధ్యలో ఉన్నది బాబ్రీ మసీదు కాదని చెప్పింది పీ.ఎన్. మిశ్రా (‘Ram Mandir Revitalisation Committee’ తరపున వాదిస్తున్న అడ్వకేట్) అని తెలుస్తుంది. సుప్రీం కోర్టు లో పీ.ఎన్.మిశ్రా చేసిన వ్యాఖ్యలను తీసుకొని సుప్రీం కోర్టు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

చివరగా, ‘అయోధ్యలో ఉన్నది బాబ్రీ మసీదు కాదు….’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll