Fake News, Telugu
 

స్విస్ బ్యాంక్ వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించలేదు

0

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ‘స్విస్ బ్యాంక్ వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు’ అని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: స్విస్ బ్యాంక్ వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు.

ఫాక్ట్ (నిజం): స్విస్ బ్యాంక్ వారు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఎటువంటి ప్రకటన చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో ఆరోపించినట్లుగా స్విస్ బ్యాంక్ వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించారా అని గూగుల్ లో వెతికినప్పుడు, అందుకు సంబంధించిన సమాచారం ఏదీ కూడా సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు.

ఒక వేల స్విస్ బ్యాంక్ వారు నిజంగానే అలా పేర్కొని ఉంటే, దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.

చివరగా, స్విస్ బ్యాంక్ వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అకౌంట్ లో 34 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll