Fake News, Telugu
 

ఈ ఫోటోలో కేజ్రీవాల్‌తో కలిసి కూర్చున్న అమ్మాయిల అక్రమ రవాణా కేసులో నిందితురాలు ప్రభా మింజ్ ముని 2018లో అరెస్ట్ అయింది, ఇటీవల కాదు

0

చిన్నారులను అక్రమ రవాణ చేసిన ఆరోపణ కింద ఇటీవల అరెస్ట్ అయిన ప్రభా మింజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిగిన పాత ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. కేజ్రీవాల్‌ సన్నిహితురాలు అయినందునే ప్రభా మింజ్ అరెస్ట్ విషయాన్నీ ఏ ఒక్క మీడియా సంస్థ రిపోర్ట్ చేయలేదని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముదో చూద్దాం.

ఈ పోస్టు యోక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇటీవల చిన్నారులను అక్రమ రవాణ చేసిన ఆరోపణ కింద అరెస్ట్ అయిన ప్రభా మింజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిగిన పాత ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కూర్చున్న ప్రభా మింజ్ ముని, ఝార్ఖండ్ నుండి యుక్త వయసు అమ్మాయిలను ఢిల్లీలో అక్రమ రవాణ చేస్తుందన్న ఆరోపణ కింద పోలీసులు 2018లో అరెస్ట్ చేసారు. 2018లో అరెస్ట్ అయిన ప్రభా మింజ్ మునికి ఝార్ఖండ్ హైకోర్టు 2019 ఏప్రిల్ నెలలో బెయిల్ మంజూరు చేసింది. ప్రభా మింజ్ మునిని ఇటీవల చిన్నారుల అక్రమ రవాణ ఆరోపణ ఆరోపణ కింద అరెస్ట్ చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2018లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అమ్మాయిలను అక్రమ రవాణ ఆరోపణ కింద అరెస్ట్ అయిన ప్రభామింజ్ ముని, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిగిన ఫోటో అని ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన ఇదే ఫోటోని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా 25 సెప్టెంబర్ 2018 నాడు ట్వీట్ చేసారు. 2017లో ప్రభా మింజ్ ముని నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకి అరవింద్ కేజ్రీవాల్‌ ముఖ్య అతిధిగా హాజరయినప్పుడు ఈ ఫోటో తీసినట్టు కపిల్ మిశ్రా ట్వీట్ ద్వారా తెలిసింది.

ప్రభా మింజ్ ముని అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ ‘The Times of India’ సంస్థ 25 సెప్టెంబర్ 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ప్రభా మింజ్ మునిని పోలీసులు 23 సెప్టెంబర్ 2018 నాడు ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ప్రభా మింజ్ ముని నిరాశ్రయుల కోసం 2014లో ఒక NGO సంస్థని ప్రారంభించి ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో నివసిస్తున్న గిరిజన అమ్మాయిలకి డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి వారిని అక్రమ రావణ చేసినట్టు ‘The Times of India’ మరొక ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ప్రభా మింజ్ ముని, ఆమె భర్త రోహిత్ ముని ‘సర్వోదయ ఆదివాసీ జనకళ్యాణ్ సంస్థ’ మరియు ఇతర NGO సంస్థల పేరుతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఢిల్లీలోని ప్రముఖ రాజకీయ నాయకులను ముఖ్య అతిధిలుగా పెలిచే వారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అరవింద్ కేజ్రీవాల్‌ 2017లో ‘సర్వోదయ ఆదివాసీ జనకళ్యాణ్ సంస్థ’ నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకి హాజరైన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.  

2018 సెప్టెంబర్ నెలలో అరెస్ట్ అయిన ప్రభా మింజ్ మునికి ఝార్ఖండ్ హైకోర్టు 2019 ఏప్రిల్ నెలలో బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత ప్రభా మింజ్ మునిని చిన్నారులు లేదా అమ్మాయిలను అక్రమ రావణ చేసిన ఆరోపణ కింద మళ్ళీ అరెస్ట్ చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో కనిపిస్తున్న ప్రభా మింజ్ మునిని పోలీసులు 2018లో అరెస్ట్ చేసారని, ఇటీవల అరెస్ట్ చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ ఫోటోలో కేజ్రీవాల్‌తో కలిసి కూర్చున్న ప్రభామింజ్ ముని ఢిల్లీ పోలీసులు 2018లో అరెస్ట్ చేసారు, ఇటివల అరెస్ట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll