Fake News, Telugu
 

స్మగ్లింగ్ బదులుగా బ్యాంకు నుండి ఋణం తీసుకోవాల్సిందని దావూద్ ఇబ్రహీం చింతించినట్టు షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా రాసిన ఆర్టికల్

0

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, డబ్బు సంపాదించటానికి స్మగ్లింగ్, ఎక్సటార్షన్ మరియు కాంట్రాక్టు కిల్లింగ్స్ మార్గం ఎన్నుకోకుండా ఒక PSU బ్యాంకు నుండి లోను తీసుకొని ఉండాల్సింది అని అన్నట్లు, ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పోస్టులో ఉన్న వీడియోలో ఈ వార్తకు సంబందించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది . అసలు ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: స్మగ్లింగ్‌, దోపిడీలతో సమయం వృథా చేసుకోకుండా ఒక PSU బ్యాంకు నుండి అప్పు చేసి ఉండాల్సింది – దావూద్‌ ఇబ్రహీం.

ఫాక్ట్ (నిజం): ఈ వార్త  ‘Faking News’ అనే వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైటు వారు ప్రచురించారు.ఇది నిజమైన వార్త కాదు. ‘Faking News’ వ్యంగంతో కూడిన ఫేక్ న్యూస్ ప్రచురిస్తారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ పోస్టులో ఉన్న క్లెయిమ్ ధృవీకరించడానికి తగిన కి వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా . ‘Should have just taken a loan instead of wasting my time in smuggling and extortion: Dawood Ibrahim’ అనే హెడ్లైన్ కలిగిన కథనం ఒకటి లభించింది. వైరల్ పోస్టులో ఉన్న  వీడియోలో ఉన్న ఆర్టికల్ కూడా ఇదే.

కథనంలో వైరల్ పోస్టులో చెప్తున్నట్లు దావూద్ ఇబ్రహీం, డబ్బు సంపాదించటానికి తాను కూడా భారతదేశంలో ఎదో ఒక PSU బ్యాంకు నుండి అప్పు తీసుకొని ఉంటే బాగుండేది స్మగ్లింగ్ లాంటివి చెయ్యకుండా, అని నిరాశ వ్యక్తపరిచినట్లు ఉంది. కానీ ఈ వార్త కథనం వ్యంగ్యంగా (satire) రాసిన ఆర్టికల్. Faking News అనే వెబ్సైటులో ఇది ప్రచురితమైంది, ఇందులో వేరు వేరు విషయాలపై ఫేక్ న్యూస్ పబ్లిష్ చేస్తారు. 2018లో  నీరవ్ మోదీ ‘పంజాబ్ నేషనల్ బ్యాంకు’ ఫ్రాడ్ కేసు వెలుగులోకి వచ్చిన సందర్భంలో దానిపై satireగా రాసిన కథనం ఇది.

ఈ వెబ్సైటును రాహుల్ రౌషన్ స్థాపించారు. గతంలో  ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ పైన  Faking News రాసిన ఒక కథనాన్ని నిజమైనదిగా భావించి  BJP నాయకుడు నితిన్ గడ్కరీ లీగల్ టీం దాన్ని ఒక కేసుకు సంభందించిన విషయంలో కోర్టుకి చూపించారు. దీని గురించి ఇక్కడ  చదవచ్చు.

చివరిగా, ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైటు ప్రచురించిన కథనాన్ని నిజమైనదిగా ఈ పోస్టు ద్వారా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll