ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, ‘పచ్చిమ బెంగాల్ లో హిందువులను చంపేయమంటూ మసీదు నుంచి వచ్చిన పిలుపు తో అక్కడ ఉన్న హిందువుల పరిస్థితి చూడండి ’ అంటూ పోస్టు చేస్తున్నారు. ఆ ఆరోపణ ఎంత వరకు వాస్తవమో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: పచ్చిమ బెంగాల్ లో ముస్లిములు హిందువులపై దాడి చేయడానికి సంబంధించిన ఫోటో
ఫాక్ట్ (నిజం): ఫోటో 2013 లో ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్’ దేశం లో జరిగిన దాడులకు సంబంధించినది. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘News Express Nigeria’ అనే వార్తా సంస్థ డిసెంబర్ 11, 2013 లో ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్’ దేశం లో నైజీరియన్ల పై జరిగిన దాడుల గురించి ప్రచురించిన కథనం లో లభించింది. ఆ ఫోటో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం రాజధాని ‘బంగి’ లో జరిగిన సంఘటనకి సంబంధించినదిగా ‘The Times’ వారి కథనం లో దాని క్రింద ఉన్న వివరణ ద్వారా కూడా తెలుస్తుంది.
చివరగా, ఆ ఫోటో 2013 లో ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్’ దేశం లో జరిగిన దాడులకు సంబంధించినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఫోటో 2013 లో ‘సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్’ దేశం లో జరిగిన దాడులకు సంబంధించినది - Fact Checking Tools | Factbase.us