Fake News, Telugu
 

ఫొటోలోని హనుమాన్ విగ్రహం దొరికింది అయోధ్యలో కాదు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో

1

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి ‘అయోధ్యలో ముస్లీములకు ఇచ్చే 5 ఎకరాల భూమిలో పురాతనమైన హనుమాన్ విగ్రహం దొరికింది’ అని పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పినదాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫొటోలోని హనుమాన్ విగ్రహం అయోధ్య (ఉత్తర్ ప్రదేశ్) లో దొరికింది.

ఫాక్ట్ (నిజం): ఫొటోలోని హనుమాన్ విగ్రహం మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో దొరికింది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

‘అయోధ్య మందిర్-మసీద్’ కేసులో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పులో సున్నీ వక్ఫ్ బోర్డు కి అయోధ్య లో 5 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.  అంతే కాదు, ఆ 5 ఎకరాలు ఎక్కడ ఇచ్చేది ఇంకా ప్రభుత్వం చెప్పలేదు.

పోస్టులో ఉన్న ఫోటోని ‘हनुमान प्रतिमा खुदाई’ అనే ఫిల్టర్ తో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రిజల్ట్ లో ఆ ఫోటో యొక్క పూర్తి ఫోటో లభించింది. కానీ, దాంట్లో ఆ ఫోటోకి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. 

ఆ సెర్చ్ రిజల్ట్స్ లో ‘Dainik Bhaskar’ వారి లింక్ కూడా ఉంది. ఆ లింక్ లోని కథనం మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో హనుమాన్ విగ్రహం దొరకడంకి సంబంధించింది. దాంతో, గూగుల్ లో ‘Madhya pradesh bhopal hanuman ancient statue excavated’ అని వెతికినప్పుడు, ‘Patrika’ వారు July 13, 2019 న ప్రచురించిన కథనం సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ కథనం లో పైన ఫొటోలాంటిదే మరొక ఫోటో ఉంది. ఆ కథనంలో ఉన్న సమాచారం ద్వారా మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లా అబ్దుల్లాహ్ గ్రామంలోని ఒక పొలంలో మొక్కలు నాటడానికి తవ్వక్కాలు జరుపుతున్నప్పుడు హనుమాన్ విగ్రహం దొరికిందని తెలిసింది.

అంతే కాదు, ఆ 5 ఎకరాలు ఎక్కడ ఇచ్చేది ఇంకా ప్రభుత్వం చెప్పలేదు. అలాంటప్పుడు ముస్లింలకు ఇచ్చే 5 ఎకరాల్లో దొరికింది అనడం కూడా తప్పుడు వార్తే.

చివరగా, ఫొటోలోని హనుమాన్ విగ్రహం దొరికింది అయోధ్యలో కాదు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ జిల్లాలో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll