Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటో లో ఉన్నది ‘COVID-19’ కి వాక్సిన్ కాదు, ‘COVID-19’ని నిర్ధారించే డయాగ్నొస్టిక్ కిట్

0

కరోనా వైరస్ (COVID-19) కి ‘Roche’ లాబరేటరీస్ వాళ్ళు ఔషధాన్ని కనిపెట్టారని, వచ్చే ఆదివారం కల్లా మిలియన్ డోసులు రిలీజ్ చేస్తారని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కరోనా వైరస్ కి ‘Roche’ లాబరేటరీస్ వాళ్ళు ఔషధాన్ని కనిపెట్టారు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది దక్షిణ కొరియా కి చెందిన ‘Sugentech’ అనే కంపెనీ తయారు చేసిన COVID-19 డయాగ్నొస్టిక్ కిట్; అది వాక్సిన్ కాదు. ఇప్పటివరకు (30 మార్చ్ 2020), COVID-19 ని నిర్ములించే ఏ ఔషధం లేదు. అంతేకాక, ట్రంప్ US లో కరోనా వైరస్ ను నిర్ధారించే వేగం పెరగాలని Roche’ లాబరేటరీస్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ (COVID-19) ‘టెస్ట్’ ని FDA ఆమోదించింది అని చెప్పాడు. తాను చెప్పింది వాక్సిన్కా గురుంచి కాదు. కావున, ఆ క్లెయిమ్ తప్పు.

పోస్ట్ లోని ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా వెతికితే, ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ట్వీట్ లో అదే ఫోటో కనిపించింది. ఆ ట్వీట్ ద్వారా అది కొరియా వాళ్ళు తయారు చేసిన COVID-19 డయాగ్నొస్టిక్ కిట్ అని తెలిసింది. కాబట్టి, ఫొటో లో ఉన్నది కరోనా వైరస్ వాక్సిన్ కాదు.

పోస్టు లోని ఫొటోలో  ‘Sugentech’  అని ఉండడంతో, ఆ కంపెనీ వెబ్సైటు లోకి వెళితే వారు ‘COVID-19 IgM/IgG‘ గురించి వివరిస్తూ ఫోటో లో ఉన్నది COVID-19 ని డిటెక్ట్ చేసే డయాగ్నొస్టిక్ కిట్ అని ఉంది. ‘Sugentech’ దక్షిణ కొరియా కి సంబంధించిన కంపెనీ.

WHO వెబ్సైట్ లో కూడా, ఇప్పటివరకు (మార్చ్ 30, 2020) COVID-19 ను తగ్గించే వాక్సిన్ కానీ ఆ వైరస్ ని నిరోధించే ఔషధం కానీ లేదని ఉంది. COVID-19 ని నిర్మూలించడానికి సాధ్యమయ్యే కొన్ని వాక్సిన్ లు, ఔషధ చికిత్సలు  పరిశోధనలో ఉన్నాయి.

ఇంతకముందు కూడా ఇలాంటి క్లెయిమ్ తోనే ఒక వీడియో (‘‘Roche’ మెడికల్ కంపెనీ వచ్చే ఆదివారం కరోనా వైరస్ (COVID-19) వ్యాధికి వాక్సిన్ విడుదల చేస్తుంది అని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్’) ప్రచారం కాబడుతుంటే, అది తప్పు అని ‘FACTLY’ ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియోలో ట్రంప్ US లో కరోనా వైరస్ ను నిర్ధారించే వేగం పెరగాలని Roche’ మెడికల్ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ (COVID-19) ‘టెస్ట్’ ని FDA ఆమోదించింది అని చెప్పాడు, వాక్సిన్ ని కాదు.

చివరగా, ‘COVID-19’ డయాగ్నొస్టిక్ కిట్ కి సంబంధించిన ఫోటోను ‘COVID-19’ వాక్సిన్ అని తప్పు ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll