Fake News, Telugu
 

పారాసెటమాల్-పి 500 మాత్రలు ‘మచుపో’ వైరస్ కలిగి ఉండడం అనేది ఒక ఫేక్ న్యూస్

0

‘తక్షణ హెచ్చరిక! పి 500 వ్రాసిన పారాసెటమాల్ తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఇది కొత్త, చాలా తెలుపు మరియు మెరిసే పారాసెటమాల్, ఇది “మచుపో” వైరస్ కలిగి ఉందని వైద్యులు సలహా ఇస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో ఒకటిగా పరిగణించబడుతుంది, అధిక మరణాల రేటు . దయచేసి ఈ సందేశాన్ని మీ సంప్రదింపు జాబితాలోని వారందరితో పాటు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు ఒక జీవితాన్ని లేదా ప్రాణాలను నా భాగాన్ని పూర్తి చేసుకోండి, ఇప్పుడు మీ వంతు ఇతరులకు మరియు తమకు సహాయం చేసేవారికి దేవుడు సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి! అందుకున్నట్లు ఫార్వార్డ్ చేయండి’ అనే మెసేజ్ ని చాలా మంది ‘Factly’ వాట్సాప్ నెంబర్ కి పంపి ఆ విషయం నిజమేనా అని అడుగుతున్నారు. ఆ మెసేజ్ ఫేస్బుక్  లో కూడా షేర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్: పారాసెటమాల్ పి 500 మాత్రలు ‘మచుపో’ వైరస్ ను కలిగి ఉంటాయి.

ఫాక్ట్ (నిజం): ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆరోగ్య సంస్థలు మరియు వైద్య సంఘాలు పారాసెటమాల్-పి 500 మాత్రలు ‘మచుపో’ వైరస్ కలిగి ఉండడం అనేది అవాస్తవం అని తేల్చాయి. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పారాసెటమాల్ మాత్రలు ‘మచుపో’ వైరస్ ను కలిగి ఉంటాయా అని గూగుల్ లో వెతికినప్పుడు, ఆ విషయం గురించి ‘The Hindu’ వార్తా సంస్థ వారు ప్రచురించిన కథనం లభించింది. ఆ వార్తా సంస్థ వారు ఆ విషయం గురించి వైద్య నిపుణులను సంప్రదించినప్పుడు, భారత దేశం లో ఇప్పటి వరకు అలాంటి కేసులేవీ కూడా నమోదు కాలేదని తెల్పినట్లుగా ఉంది. అందులో, అలా వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, అదొక ‘హోక్స్’ అని పేర్కొంది.

గతంలో, అలాంటి వార్తలు సింగపూర్ లో చలామణీ అయినప్పుడు, సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ (HSA) వారు అలా వస్తున్న వార్తల్లో నిజం లేదు అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అదే వార్త మలేషియాలో కూడా వ్యాపించినప్పుడు, ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దానినిఅవాస్తవమని తేల్చింది.

చివరగా, పారాసెటమాల్-పి 500 మాత్రలు ‘మచుపో’ వైరస్ కలిగి ఉండడం అనేది ఒక ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll