Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో ట్రంప్ ప్రకటించింది కరోనా వైరస్ నిర్దారించే ‘టెస్ట్’ గురించి, వాక్సిన్ గురించి కాదు

0

వచ్చే ఆదివారం కరోనా వైరస్ (COVID-19) వ్యాధికి ‘Roche ‘మెడికల్ కంపెనీ వాక్సిన్ విడుదల చేయనుంది అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు వాస్తవం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘Roche’ మెడికల్ కంపెనీ వచ్చే ఆదివారం కరోనా వైరస్ (COVID-19) వ్యాధికి వాక్సిన్ విడుదల చేస్తుంది అని ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియోలో కరోనా వైరస్ కి ‘Roche’ మెడికల్ కంపెనీ వాక్సిన్ విడుదల చేస్తుందని ట్రంప్ చెప్పలేదు. US లో కరోనా వైరస్ ను పరీక్షించే వేగం పెరగాలని Roche’ మెడికల్ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ (COVID-19) ‘టెస్ట్’ ని FDA ఆమోదించింది అని ప్రకటించాడు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పైన పోస్ట్ చేసిన వీడియో క్లిప్ లో అమెరికా ప్రెసిడెంట్ , డోనాల్డ్ ట్రంప్  ‘Roche ‘మెడికల్ కంపెనీ సీఈఓ, మాట్ సౌసే కి పోడియం ఇవ్వడం చూడవచ్చు. అప్పుడు, ఆ కంపెనీ సీఈఓ మాట్లాడుతూ తమ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టెస్ట్ ను వేగంగా ఆమోదించిన FDA (U.S ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కి ధన్యవాదాలు తెలపడం చూడవచ్చు.

ఇవే పదాలతో  ఇంటర్నెట్ లో వెతికితే పోస్టు లోని వీడియో క్లిప్ కి సంబంధించిన పూర్తి వీడియో అమెరికా అధ్యక్షుడి అధికారిక ‘White House’ వెబ్సైట్ లో దొరికింది. 13 మార్చ్ 2020న పెట్టిన ఆ వీడియో లో ట్రంప్ ‘నేషనల్ ఎమర్జెన్సీ’ ప్రకటించి 50 బిలియన్ డాలర్ల ఎమర్జెన్సీ ఫండ్ ను కరోనా వైరస్ వ్యాధిని నివారించడానికి ఆ దేశం లోని రాష్ట్రాలకు రిలీజ్ చేసాడు. ఆ తరువాత ట్రంప్,  దేశంలో కరోనా వైరస్ ను పరీక్షించే వేగం పెరగాలని ‘Roche’ మెడికల్ కంపెనీ అభివృద్ధి  చేసిన కరోనా వైరస్ (COVID-19) ‘టెస్ట్’ ని FDA ఆమోదించింది అని తెలిపాడు. అంతేకాక, తాను ఐదు లక్షల అదనపు టెస్టులు వచ్చే వారం ప్రారంభంలో అందుబాటులోకి వస్తాయని  ఆశిస్తున్నానని, ఆ టెస్టులు జరిగే చోట్లను ఆదివారం రోజున ప్రకటిస్తానని చెప్పాడు. ఆ వీడియోలో ఆ తరువాత వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మరియు కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు కూడా మాట్లాడారు. ‘Roche’ డయాగ్నోస్టిక్స్ వెబ్సైట్ ద్వారా  కరోనా వైరస్ పేషెంట్లను టెస్ట్ చేయడానికి COVID-19 టెస్ట్ కిట్లను ఈ మధ్యనే US లో ఉన్న లాబరేటరీస్ కి తరలించారని తెలిసింది.

U.S. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) యొక్క వెబ్‌సైట్ ప్రకారం, కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆమోదించబడిన వ్యాక్సిన్లు ప్రస్తుతం లేవు. కానీ, ఆ వ్యాధి నుండి కాపాడుకోవడానికి తయారు చేసిన ఒక పరిశోధనాత్మక వాక్సిన్ (mRNA-1273) ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మార్చ్ 16 నుండి ఫేస్ -I క్లినికల్ ట్రయల్స్ ని మొదలు పెట్టారు. ఆ వాక్సిన్ కరోనా వ్యాధి నుంచి కాపాడాటానికి పనికి వస్తుందా రాదా అని అంచనా వేయడానికి ఇంకా ఎన్నో పరీక్షలు జరపాలి, అందులో ఈ  ఫేస్ -I ట్రయల్ మొదటిది మాత్రమే. NIAD (నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీస్), ‘Moderna’ అనే ఒక బయోటెక్ కంపెనీ  కలిసి ఆ వాక్సిన్ ని  తయారు చేసారు.

చివరగా, ట్రంప్ ఆ వీడియోలో  ‘Roche’ అనే మెడికల్ కంపెనీ తయారు చేసిన కరోనా వైరస్ (COVID-19) నిర్ధారించే ‘టెస్ట్’ ని FDA ఆమోదించింది అని చెప్పాడు, వాక్సిన్ గురించి కాదు

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll