Fake News, Telugu
 

పర్సనలైజ్డ్ వీడియోలను షేర్ చేస్తూ మహిపాల్ రెడ్డి గెలుపును కోరుతూ అర్జున్ కపూర్, కుల్దీప్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు అంటున్నారు

0

30 నవంబర్ 2023 నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నటుడు అర్జున్ కపూర్, క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియో మెసేజెస్ అంటూ సోషల్ మీడియాలో రెండు వీడియోలు బాగా షేర్ అవుతునాయి. ఆ వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి గెలుపు కోరుకుంటూ నటుడు అర్జున్ కపూర్ మరియు క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు.

ఫాక్ట్ (నిజం): FNP మరియు  ‘auromaxdigital’ యూట్యూబ్ ఛానెల్స్ పబ్లిష్ చేసిన పర్సనలైజ్డ్ వీడియోలను ఈ పోస్టులు షేర్ చేశాయి. మహిపాల్ రెడ్డి గెలుపును కోరుతూ అర్జున్ కపూర్ లేదా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఎటువంటి వీడియోలను పోస్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

వీడియో-1:

మహిపాల్ రెడ్డి గెలుపును కోరుతూ అర్జున్ కపూర్ ఇటువంటి వీడియో ఏదైనా పోస్ట్ చేశారా అని వెతికితే, అటువంటి వీడియో ఏది మాకు అర్జున్ కపూర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దొరకలేదు. ఇవే దృశ్యాలతో ఇతర సోషల్ మీడియా యూసర్లు షేర్ చేసిన మరికొన్ని వీడియోలలో, అర్జున్ కపూర్ ఇతర వ్యక్తుల పేర్లను పేర్కొంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ అర్జున్ కపూర్ వీడియోని ‘ఫర్న్స్ ఎన్ పెటల్స్’ (FNP) అనే ఈ-కామర్స్ సంస్థ 27 జూన్ 2023 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

అర్జున్ కపూర్ FNP నుండి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. FNP వెబ్సైటుకి వెళ్ళడం ద్వారా ఈ సేవలను ఈ రోజే పొందండి.”, అని ఈ వీడియో వివరణలో రాశారు. అర్జున్ కపూర్ పర్సనలైజ్డ్ వీడియోలను రూ. 599కి అమ్ముతూ FNP వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసిన పోస్టర్లను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. FNP యూట్యూబ్ ఛానెల్ పబ్లిష్ చేసిన మరికొన్ని పర్సనలైజ్డ్ వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

వీడియో-2:

మహిపాల్ రెడ్డి గెలుపును కోరుతూ కుల్దీప్ యాదవ్ ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎటువంటి వీడియోను పోస్ట్ చేయలేదు. ఇవే దృశ్యాలతో ఇతర సోషల్ మీడియా యూసర్లు షేర్ చేసిన మరికొన్ని వీడియోలలో, కుల్దీప్ యాదవ్ ఇతర వ్యక్తులకు పుట్టినరోజు శుభాకాంక్షలు లేదా స్పూర్తిదాయక సందేశాలు తెలుపుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోని ‘auromaxdigital’ అనే యూట్యూబ్ ఛానెల్ 31 అక్టోబర్ 2023 నాడు పబ్లిష్ చేస్తూ, ఈ సూపర్ థాంక్స్ మెసేజ్ పొందడానికి రూ. 40 చెల్లించాలని వీడియోపై ఒక లింక్ పెట్టారు. ఈ యూట్యూబ్ ఛానెల్ రోహిత్ శర్మ మరియు ఇతర క్రికెటర్ల పర్సనలైజ్డ్ వీడియోలను కూడా బ్లిష్ చేసింది. కుల్దీప్ యాదవ్‌కు సంబంధించి మరొక వెబ్సైటులో అందుబాటులో ఉన్న పర్సనలైజ్డ్ వీడియోను ఇక్కడ చూడవచ్చు.  

చివరగా, పర్సనలైజ్డ్ వీడియోలను మహిపాల్ రెడ్డి గెలుపును కోరుతూ అర్జున్ కపూర్ మరియు కుల్దీప్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు అంటూ షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll