Fake News, Telugu
 

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్నో పేరు లక్ష్మణపురిగా మారుస్తున్నట్టు ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు

0

లక్నో పేరు మార్చబడింది. దాని అసలు పేరు  ‘లక్ష్మణపురి’గా  మార్చి ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: లక్నో నగరం పేరు దాని అసలు పేరైన లక్ష్మణపురిగా మారుస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

ఫాక్ట్(నిజం): ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్నో పేరును లక్ష్మణపురిగా మారుస్తున్నట్టు ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం కానీ ప్రకటన కానీ ఇవ్వలేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి తెలుసుకోవటానికి కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం కానీ ప్రకటన కానీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు అని తెలుసుకున్నాం.

అయితే, ఈ దావా గురించి చాలా తరచుగా వార్తలు వస్తున్నట్లు మేము గమనించాం. లక్నో పేరు లక్ష్మణపురిగా మార్చాలి అని చాలా కాలం నుండి పలు బీజేపీకి చెందిన వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణం శ్రీ రాముడు శ్రీలంకను జయించిన తర్వాత తన సోదరుడు లక్ష్మణ్‌కు లక్నో భూభాగాన్ని బహుమతిగా ఇచ్చాడు కాబట్టి, లక్నో అసలు పేరు లక్ష్మణ్‌పూర్అని పిలుస్తారని. లక్నో అనే పేరు తరువాత కాలంలో లక్ష్మణ్‌పూర్, లఖన్‌పూర్ లేదా లచ్‌మణ్‌పూర్‌కి అనువదించబడిన సంస్కరణ అని తెలుపుతున్నారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ వాదనకు స్పందిస్తూ, ఫిబ్రవరి 2023లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతికి మొఘల్ చక్రవర్తులు చేసిన సేవలను బీజేపీ గుర్తిస్తుందని, మొఘల్ వారసత్వాన్ని తుడిచివేయడానికి ప్రయత్నించమని స్పష్టం చేశారు (ఇక్కడ మరియు ఇక్కడ)

చివరిగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లక్నో పేరు లక్ష్మణపురిగా మారుస్తున్నట్టు ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు.

Share.

About Author

Comments are closed.

scroll