Fake News, Telugu
 

ట్యాంక్ బండ్ పై ఉన్న ఈ డోమ్ మీద 2011లో బీజేపీ జెండాతో పాటు ఇతర పార్టీ జెండాలు కూడా ఎగురవేశారు     

0

జాతీయ జెండాని తీసేసి బీజేపీ జెండాని బీజేపీ వారు పెట్టినట్టు చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జాతీయ జెండాని తీసేసి బీజేపీ జెండాని బీజేపీ వారు పెడుతున్న ఫోటో.

ఫాక్ట్: పోస్ట్ చేసిన ఫోటో యొక్క పూర్తి ఫోటోలో బీజేపీ జెండాతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండా మరియు ఇతర జెండాలు ఉన్నట్టు చూడవొచ్చు. ఫోటోని 10 మార్చి 2011న హైదరాబాద్ లో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తీసారు. ఫోటోలోని డోమ్ పై సాధారణంగా ఎటువంటి జెండా ఉండదు. కావున పోస్ట్ లో క్రాప్ చేసిన ఫోటో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోని ఇంతకముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. ఢిల్లీ లో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ లో ఎర్ర కోట లో వివిధ జెండాలను నిరసనకారులు పెట్టిన నేపథ్యంలో ఈ ఫోటోని మళ్ళీ షేర్ చేస్తున్నారు. ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, పూర్తి ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పూర్తి ఫోటోలో బీజేపీ జెండాతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండా మరియు ఇతర జెండా (‘జై తెలంగాణ’ అని రాసి ఉంది) ఉన్నట్టు చూడవొచ్చు. ఫోటోని 10 మార్చి 2011 న హైదరాబాద్ లో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తీసినట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహిస్తున్న వ్యక్తులు పార్టీ జెండాలను డోమ్ పై కడుతున్నట్టు ఫోటో వివరణలో చదవొచ్చు.

ఫోటోలో ఉన్న డోమ్ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై ఉంటుంది. ఆ డోమ్ పై సాధారణంగా ఎటువంటి జెండా ఉండదు. ఆ డోమ్ కి సంబంధించిన ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, ఇతర ఫోటోల్లో పార్టీ జెండాలతో పాటు జాతీయ జెండా ని కూడా డోమ్ పై నిరసనకారులు పట్టుకున్నట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ లోని ఫోటో కాకుండా కొన్ని ఇతర ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. వాటిల్లో ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగిస్తున్నట్టు ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోపై 2019 లో FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

అయితే, ఉత్తరప్రదేశ్ లో ఒక ర్యాలీ లో భాగంగా 2017 లో బీజేపీ జెండా కింద భారతదేశ జెండా ఎగరవేసినట్టు తెలిసింది.

చివరగా, ట్యాంక్ బండ్ పై ఉన్న ఈ డోమ్ మీద 2011లో బీజేపీ జెండాతో పాటు ఇతర పార్టీ జెండాలు కూడా ఎగురవేశారు.

Share.

About Author

Comments are closed.

scroll