మోదీ అమెరికా రాకను పురస్కరించుకొని, రిహార్సల్స్ లో భాగంగా అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించింది అనే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కాబడుతోంది. ఈ వాదనలో ఎంత నిజం వుందో విశ్లేషిద్దాం.

క్లెయిమ్ : మోదీ అమెరికా రాకను పురస్కరించుకొని, రిహార్సల్స్ లో భాగంగా భారత జాతీయ గీతాన్ని ఆలపించిన అమెరికా ఆర్మీ బ్యాండ్.
ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపించినట్టు నిజంగానే అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించింది. కానీ అది ‘యుధ్ అభ్యాస్ 2019’ కార్యక్రమంలో భాగంగా చేసింది. కావున, పోస్ట్ లో క్లెయిమ్ చేసినట్టు ఈ వీడియో మోదీ రాకకై చేసిన రిహార్సల్స్ అనేది అబద్ధం.
ANI వీడియోలో వున్న సమాచారం ప్రకారం ఆ అమెరికా ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన ‘యుధ్ అభ్యాస్’ 2019ది అని తెలుస్తుంది. ‘యుధ్ అభ్యాస్’ అనేది భారత్ మరియు అమెరికా మధ్యలో జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ఒక సంవత్సరం భారత్ నిర్వహిస్తే ఇంకో సంవత్సరం అమెరికా నిర్వహిస్తుంది. వీడియోలో చూపించింది ‘యుధ్ అభ్యాస్’ 15వ ఎడిషన్.

చివరగా, జాయింట్ బేస్ లూయిస్, మెక్ కార్డ్ లో జరిగిన ‘యుధ్ అభ్యాస్ 2019’ కార్యక్రమంలో అమెరికన్ ఆర్మీ బ్యాండ్ ఆలపించిన భారత జాతీయ గీతాన్ని మోదీ అమెరికా రాకను పురస్కరించుకొని రిహార్సల్స్ లో భాగంగా ప్లే చేశారని షేర్ చేసారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?