Fake News, Telugu
 

ఫోటోలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న వ్యక్తి తన సోదరుడు; పరాయి వ్యక్తి కాదు

0

ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న ఫోటోని కొంత మంది సోషల్ మీడియాలో విస్త్రుతంగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ ఫోటో కింద చాలా అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నట్టు చూడవచ్చు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక పరాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న వ్యక్తి పరాయి వాడు కాదు, అతను తన సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి. తాజాగా రోజాసెల్వమణికి మంత్రి పదవి వచ్చిన సందర్భంలో చేసుకున్న వేడుకల్లో తీసిన ఫోటో అది. కావున, పోస్ట్‌లో ముద్దు పెడుతుంది తన సోదరుడు అని చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన ఫోటోలో ‘సాక్షి’ ఛానల్ లోగో ఉన్నట్టు గమనించవచ్చు. దాని ఆధారంగా వెతకగా, ఆ స్క్రీన్‌షాట్‌కి సంబంధించిన వీడియో ‘సాక్షి’ యూట్యూబ్ ఛానల్‌లో దొరుకుతుంది. తాజాగా రోజా సెల్వమణికి మంత్రి పదవి వచ్చిన సందర్భంలో కుటుంబ సభ్యులతో చేసుకున్న వేడుకలకు ఆ వీడియో సంబంధించినట్టు తెలిసింది.

ఫోటోలోని వ్యక్తి గురించి వెతకగా, అతను రోజా సెల్వమణి సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి అని తెలిసింది.

వివిధ సందర్భాల్లో తన సోదరుడికి శుభాకాంక్షలు చెప్తూ, రోజా పెట్టిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఫోటోలో ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణికి ముద్దు పెడుతున్న వ్యక్తి తన సోదరుడు; పరాయి వ్యక్తి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll