Fake News, Telugu
 

‘0 నుండి 9’ సంవత్సరాల పిల్లలలో సుమారు 17 శాతం మాత్రమే ముస్లిం మతానికి చెందిన పిల్లలు ఉన్నారు

0

‘ముంచుకొస్తున్న పెను ప్రమాదం’ అని చెప్తూ, ‘0 నుండి 6’ సంవత్సరాలలోపు ఉన్న పిల్లలలో 46 శాతం పిల్లలు ముస్లింల సంతానమే అని చాలా మంది ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘0 నుండి 6’ సంవత్సరాలలోపు ఉన్న పిల్లలలో 46 శాతం ముస్లింల పిల్లలే ఉన్నారు.    

ఫాక్ట్ (నిజం): ‘0 నుండి 6’ సంవత్సరాల పిల్లల జనాభా లెక్కలు మతాల వారిగా 2011 సెన్సస్ లో ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అందుకే, ‘0 నుండి 4’, 5 నుండి 9’ మరియు ‘0 నుండి 9’ సంవత్సరాల పిల్లల డేటా చూడగా సుమారు 17 శాతం మాత్రమే ముస్లిం పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి తెలుసుకోవడానికి సెన్సస్-2011 వెబ్ సైట్ లో డేటా కోసం చూడగా, ‘Religious Community By Age-Group And Sex’ అనే డేటాసెట్ లో ‘0 నుండి 6’ సంవత్సరాల పిల్లల డేటా విడిగా లేదు. దాంట్లో ‘0 నుండి 4’ మరియు ‘5 నుండి 9’ సంవత్సరాల పిల్లలు వివిధ మతాల్లో ఎంత మంది ఉన్నారో డేటా మాత్రం ఉంది. కావున, ‘0 నుండి 4’, ‘5 నుండి 9’ మరియు ‘0 నుండి 9’ సంవత్సరాల పిల్లలలో ముస్లింల పిల్లలు ఎంత మంది ఉన్నారో చూద్దాం.

‘0 నుండి 4’ సంవత్సరాల పిల్లలు:

‘5 నుండి 9’ సంవత్సరాల పిల్లలు:

‘0 నుండి 9’ సంవత్సరాల పిల్లలు:

ఏ విధంగా చూసిన ముస్లింల పిల్లల శాతం సుమారు 17 శాతం మాత్రమే ఉంది. హిందువుల పిల్లల శాతం సుమారు 78 శాతం ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

చివరగా, ‘0 నుండి 9’ సంవత్సరాల పిల్లలలో సుమారు 17 శాతం మాత్రమే ముస్లిం మతానికి చెందిన పిల్లలు ఉన్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll