Fake News, Telugu
 

ఫొటోలోని నందీశ్వరుడి విగ్రహం వయి (మహారాష్ట్ర ) లోని ‘కాశీ విశ్వేశ్వర ఆలయం’ లోనిది

1

ఫేస్బుక్ లో రెండు ఫోటోలు పోస్టు చేసి, అవి కాశీ క్షేత్రం లోని జ్ఞానవాపి మసీదు లోపల మరియు బయట కనబడే దృశ్యాల ఫోటోలు అని కొంత మంది పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పింది ఎంతవరకు నిజమో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలోని నందీశ్వరుడి విగ్రహం కాశీ క్షేత్రం (ఉత్తర్ ప్రదేశ్) లోని జ్ఞానవాప్సి మసీదు ప్రాంగణంలో ఉంది.    

ఫాక్ట్ (నిజం): ఫొటోలో ఉన్నది మహారాష్ట్ర లోని ‘వయి’ అనే ప్రాంతంలో ఉన్న ‘కాశీ విశ్వేశ్వర ఆలయం’ లోని నందీశ్వరుడి విగ్రహం. కావున, పోస్టులో చెప్పింది తప్పు

పోస్ట్ లోని రెండు ఫొటోల్లో, పైన ఉన్న ఫోటో ‘విశ్వేశ్వర్ ఆలయం పైన నిర్మించబడిన జ్ఞానవాప్సి మసీదు’ ది అని ‘Firstpost’ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అది కాశి క్షేత్రం (వారణాసి) లో ఉంది. 

పోస్ట్ లో ఉన్న నందీశ్వరుడి విగ్రహం ఫోటోని యండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Shutterstock’ కి సంబంధించిన లింక్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. దానిని చూసినప్పుడు, ఆ ఫోటో లోని నందీశ్వరుడి విగ్రహం పోస్టు లోని ఫొటోలోని దానితో సరిపోలినట్లుగా చూడవచ్చు. అంతేకాకుండా ఆ రెండు ఫొటోల్లోని కట్టడం కూడా ఒకేలా ఉండడం గమనించవచ్చు. ‘Shutterstock’ లో ఆ ఫోటో గురించి ఉన్న వివరణ ద్వారా, అది మహారాష్ట్ర లోని ‘వయి’ అనే ప్రాంతంలో ఉన్న ‘కాశీ విశ్వేశ్వర ఆలయం’ లోని నందీశ్వరుడి విగ్రహం అని తెలుస్తుంది.

‘Shutterstock’ లో ఆ గుడిలోని నందీశ్వరుడి విగ్రహంకి సంబంధించిన మరికొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఫొటోలోని నందీశ్వరుడి విగ్రహం వయి(మహారాష్ట్ర )లోని ‘కాశీ విశ్వేశ్వర ఆలయం’ లోనిది. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll