Fake News, Telugu
 

ఆర్థికవేత్త జాన్ డ్రెజ్‌ని 2019లో ఝార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని గంటల్లోనే విడుదల చేసారు

0

ఆర్థికవేత్త జాన్ డ్రెజ్‌ని ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలోని బిష్ణుపుర పోలీస్ స్టేషన్ లాకప్లో గత రెండు రోజులుగా కేవలం చెడ్డీతో కూర్చొపెట్టారని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఆర్థికవేత్త జాన్ డ్రెజ్‌ని అరెస్ట్ చేసిన ఝార్ఖండ్‌ పోలీసులు, గత రెండు రోజులుగా ఆయన్ని కేవలం చెడ్డీతో ఉంచారు.

ఫాక్ట్(నిజం): జాన్ డ్రెజ్‌ని 2019లో అధికారుల నుండి అనుమతులు తీసుకోకుండా సమావేశం నిర్వహించినందుకు ఝార్ఖండ్‌లోని బిష్ణుపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అయన మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు ప్రశ్నించి కొన్ని గంటల్లో వదిలేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సరైన కీ వర్డ్స్ ఉపయోగించి జాన్ డ్రెజ్‌ అరెస్టు గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఆర్థికవేత్త జాన్ డ్రెజ్‌ని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసినట్టు ఎటువంటి కథనాలు దొరకలేదు. కానీ తనని పోలీసులు అదుపులోకి తీసుకున్న 2019 నాటి వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ)

వార్త కథనాల ప్రకారం జాన్ డ్రెజ్‌ మరియు తన ఇద్దరు సహచరులు అనూజ్, వివేక్ లను ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలోని బిష్ణుపుర పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలేసారు. అధికారుల నుండి అనుమతి తీసుకోకుండా సమావేశం నిర్వహించినందుకు వీరిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించి వదిలేసినట్లు గర్వా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హర్ష్ మంగ్లా అప్పట్లో ఔట్‌లుక్‌కి తెలిపారు. 2019లో జరిగిన సంఘటనను, ఇప్పుడు జరిగినట్లు, అంతే కాక జాన్ డ్రెజ్‌ ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తప్పుడు కథనంతో పోస్టులో షేర్ చేస్తున్నారు.

ఆర్థికవేత్త అయిన జాన్ డ్రెజ్‌ నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తో కలిసి హాంగర్ అండ్ పబ్లిక్ ఆక్షన్ అనే పుస్తకాన్ని రచించారు. ఆయన గురించి మరింత సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు.

చివరిగా, ఆర్థికవేత్త  జాన్ డ్రెజ్‌ని అరెస్ట్ అయ్యి గత రెండు రోజులుగా లాక్ అప్‌లో ఉన్నట్లుగా తప్పుగా షేర్ చేస్తున్నారు, 2019లో జాన్ డ్రెజ్‌ని అదుపులోకి తీసుకున్న కొన్ని గంట్లల్లోనే ఝార్ఖండ్ పోలీసులు అతన్ని విడుదల చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll