Fake News, Telugu
 

సామాజిక కార్యకర్త షబ్నం షేఖ్‌ వీడియోని ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా హెచ్చరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా హెచ్చరిస్తూ, సరైన శిక్ష విధించిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఇటువంటి హిందూ అధికారులు ఉంటే లవ్ జిహాద్ చేసి హిందూ అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలనుకునే వారిలో భయం మొదలవుతుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా నిలదీస్తున్న దృశ్యాలు.  

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్నది ముంబైకి చెందిన సోషల్ ఆక్టివిస్ట్ మరియు హెల్ప్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు షబ్నం షేఖ్. కుటుంబ కలహాలకు లేదా మరే ఇతర వివాదాలకు సంబంధించి తన దగ్గరకు వచ్చే వారికి షబ్నం షేఖ్ సలహాలు లేదా పరిష్కారాలు ఇస్తుంది. ఈ వీడియోలోని వ్యక్తిని నిలదీస్తున్నది హిందూ అధికారిని లేదా న్యాయమూర్తి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని పలు యూసర్లు 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని క్క, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఫ్యామిలీ కోర్టులో ఒక మహిళా న్యాయమూర్తి తప్పు చేసిన చేసిన వ్యక్తిని గట్టిగా నిలదీస్తూ సరైన శిక్ష వీడించిన దృశ్యాలని ఒక యూసర్ ఈ వీడియోని ట్వీట్ చేసినప్పుడు, ఈ వీడియోలో కనిపిస్తున్నది సంఘ సంస్కర్తగా చెప్పుకొనే షబ్నం షేఖ్ అని ఒక యూసర్ ట్వీట్‌కి సమాధానమిస్తూ తెలిపారు. అంతేకాదు, షబ్నం షేఖ్‌కు సంబంధించిన మరొక వీడియోని కూడా ఈ యూసర్ ట్వీట్ చేశారు.

ఈ వివరాల ఆధారంగా షబ్నం షేఖ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, కుటుంబ కలహాలకు సంబంధించి షబ్నం షేఖ్ పబ్లిష్ చేసిన అనేక ఇతర వీడియోలు దొరికాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

షబ్నం షేఖ్‌ ముంబైకి చెందిన ఒక సామాజిక కార్యకర్త మరియు హెల్ప్ కేర్ ఫౌండేషన్ అనే సంస్థ వ్యవస్థాపకురాలని, కుటుంబ కలహాలు లేదా మరే ఇతర వివాదాలకు సంబంధించి తన దగ్గరకు వచ్చే క్లయింట్లకు షబ్నం షేఖ్ సలహాలు లేదా పరిష్కారాలు ఇస్తుందని తెలిసింది. షబ్నం షేఖ్‌ తన తండ్రి పేరు అబ్దుల్ హమీద్ షేఖ్ అని ఒక ఇంస్టాగ్రామ్ పోస్టులో తెలిపింది. షబ్నం షేఖ్‌కు సంబంధించిన మరికొన్ని వీడియోలు మరియు ఫోటోలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న మహిళ న్యాయమూర్తి లేదా మరే ఇతర ప్రభుత్వ అధికారి కాదని మరియు ఆమె హిందూ మహిళ కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సామాజిక కార్యకర్త షబ్నం షేఖ్‌ యొక్క వీడియోని ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిని మోసం చేసిన ముస్లిం వ్యక్తిని హిందూ అధికారి హెచ్చరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll