Fake News, Telugu
 

శ్రీనగర్‌లో జరిగిన రామనవమి వేడుకల వీడియోని పాకిస్థాన్‌కు చెందినదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పాకిస్థాన్‌లో జరిగిన రామనవమి పండుగ వేడుకలకు సంబంధించినది అంటూ ఒక ఊరేగింపు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌లో జరిగిన రామ నవమి వేడుకల వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో వీడియో ఈ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీనగర్‌లో కాశ్మీరీ పండిట్లు చేపట్టిన ‘శోభా యాత్ర’ ఊరేగింపుకు సంబందించినది. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు

పోస్టులో చెప్తున్నట్లుగా ఈ వీడియో పాకిస్థాన్లో జరిగిన రామనవమి వేడుకలకి సంబందించినదా కాదా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ లో వెతికితే, వైరల్ విజువల్స్‌ను కలిగి ఉన్న ఎటువంటి మీడియా కథనాలు లభించలేదు. తర్వాత ఈ వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను గూగుల్ లెన్స్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లలో ఒకదానిపై ఉర్దూలో ‘శ్రీనగర్‌లోని కాశ్మీరీ పండిట్లు’ అని రాసి ఉందని తెలిసింది.

అంతేకాక, వీడియో యొక్క కుడి పై భాగంలో VOA:వాయిస్ ఆఫ్ అమెరికా న్యూస్ యొక్క లోగోను మరియు దాని కింద ఉర్దూలో ఒక అక్షరం రాసి ఉందని గమనించాము. వీటిని ఆధారంగా తీసుకుని, గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలో ఉన్న ఫుటేజీని కలిగి ఉన్న VOA ఉర్దూ వారి ట్వీట్‌ దొరికింది.

ఈ ట్వీట్ ప్రకారం, కాశ్మీరీ పండిట్లు 30 మార్చి 2023న శ్రీనగర్‌లో ‘శోభా యాత్ర’ చేపట్టారు. ఆ యాత్రకు సంబంధించిన వీడియో ఇది. రామనవమి పండుగను పురస్కరించుకుని ఈ ‘శోభా యాత్ర’ నిర్వహించారని ANI ఒక వీడియో రిపోర్టు ద్వారా తెలియచేసింది.

‘శ్రీనగర్‌లోని పాతబస్తీలోని జైందార్ మొహల్లా నుంచి ప్రారంభమై నగరంలోని వాణిజ్య కేంద్రమైన లాల్ చౌక్ మీదుగా సాగిన శోభా యాత్రకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు సీఆర్‌పీఎఫ్ గట్టి భద్రతను కల్పించారు.’ అని జీ న్యూస్ తమ కథనంలో పేర్కొనింది. కొన్ని ఇతర మీడియా సంస్థలు కూడా ఈ యాత్ర గురించి కథనాలు ప్రచురించాయి,  వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరిగా, భారతదేశంలోని శ్రీనగర్‌లో జరిగిన రామనవమి వేడుకల వీడియోని పాకిస్తాన్‌లో రామనవమి వేడుకలకి సంబందించినది అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll