Fake News, Telugu
 

వెస్ట్ బెంగాల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లో కేవలం ముస్లిములే కాదు, హిందువులు కూడా సెలెక్ట్ అయ్యారు

0

వెస్ట్ బెంగాల్ లో ఇటీవల జరిగిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లో ఒక్క హిందూ మతానికి చెందిన వ్యక్తి కూడా ఎంపిక కాలేదని, ఎంపికైన వారందరూ ముస్లిం మతానికి చెందిన వారేనని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వెస్ట్ బెంగాల్ లో ఇటీవల జరిగిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లో ఒక్క హిందూ మతానికి చెందిన వ్యక్తి కూడా ఎంపిక కాలేదు, ఎంపికైన వారందరూ ముస్లిం మతానికి చెందిన వారే.

ఫాక్ట్ (నిజం): వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలకు సంబంధించిన ఈ లిస్టు కేవలం OBC-A క్యాటేగిరీ కింద సెలెక్ట్ అయిన వారిది మాత్రమే. వెస్ట్ బెంగాల్ లో కులాల వర్గీకరణలో OBC-A క్యాటేగిరీ కింద ఉన్న 80 ఉప కులాలలో 72  ఉప కులాలు ముస్లిం మతానికి చెందినవి, అందుకే OBC-A క్యాటేగిరీ కింద సెలెక్ట్ అయిన వారిలో ఎక్కువ శాతం ముస్లిం మతానికి చెందినవారున్నారు. ఈ రిక్రూట్మెంట్ లో ఇతర క్యాటేగిరీల (OBC-B, SC, ST, UR) కింద సెలెక్ట్ అయినవారిలో హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. పైగా ఈ రిక్రూట్మెంట్లో మొత్తంగా సెలెక్ట్ అయినవారిలో ముస్లిముల కంటే హిందువులే ఎక్కువ. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 09 ఆగస్టు 2019న విడుదల చేసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్మడ్ (AB) & అన్ ఆర్మడ్ (UB)) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన వారి వివరాలను వెస్ట్ బెంగాల్ పోలీస్ వెబ్సైటులో క్యాటేగిరిల వారిగా అందుబాటులో ఉంచారు. ఐతే పోస్టులో ఉన్న లిస్టు ఈ ఫలితాలకి సంబంధించిందే అయినప్పటికి, ఇది కేవలం OBC-A క్యాటేగిరిలో అన్ ఆర్మడ్ (UB) విభాగం కింద సెలెక్ట్ అయిన 50 మందికి సంబంధించిన లిస్ట్ మాత్రమే.

ఐతే ఈ లిస్టులో సెలెక్ట్ అయిన వారి మతానికి సంబంధించిన వివరాలు లేనప్పటికీ, వారి పేర్ల ఆధారంగా చుస్తే ఎక్కువ శాతం మంది ముస్లిం మాతానికి చాందినవారై ఉండొచ్చని అర్ధమవుతుంది. ఐతే దీనికి కారణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 80 ఉప కులాలను OBC-A క్యాటేగిరి కింద వర్గీకరించారు. ఈ 80 ఉప కులాలలో 72 (90%) ఉప కులాలు ముస్లిం మతానికి చెందినవే, కేవలం 8 ఉప కులాలు ఇతర మతాలకు చెందినవి. OBC-Aలో ఎక్కువ శాతం ముస్లిం మతానికి చెందిన కులాలు ఉన్న కారణంగానే అన్ ఆర్మడ్ (UB) విభాగంలో OBC-A క్యాటేగిరి కింద సెలెక్ట్ అయినవారిలో ఎక్కువ శాతం మంది ముస్లిములు ఉండొచ్చు.

ఐతే ఈ ఫలితాలకు సంబంధించి ఆర్మడ్ (AB) మరియు అన్ ఆర్మడ్ (UB) విభాగాలలో ఇతర క్యాటేగిరీలలో (OBC-B, SC, ST, UR)  సెలెక్ట్ అయిన వారి పేర్ల ఆధారంగా చూస్తే ఎక్కువ శాతం హిందూ మతానికి చెందినవారే ఉన్నట్టు అర్ధమవుతుంది. పైగా ఈ రిక్రూట్మెంట్లో మొత్తంగా సెలెక్ట్ అయినవారిలో ముస్లిముల కంటే హిందువులే ఎక్కువ. కావున వెస్ట్ బెంగాల్ లో సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లో హిందువులు ఒక్కరు కూడా సెలెక్ట్ కాలేదన్న వాదనలో నిజంలేదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, వెస్ట్ బెంగాల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ లో కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాకుండా హిందువులు కూడా సెలెక్ట్ అయ్యారు.

Share.

About Author

Comments are closed.

scroll