Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ వీడియో అని షేర్ చేస్తున్నారు

0

పోలింగ్ బూత్ లో ఉన్న ఒక మహిళ ఇతర మహిళలను దగ్గరుండి ఓటు వేయిస్తున్న వీడియోని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ ఘటన వీడియో.

ఫాక్ట్: వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 2021 లో జరిగాయి. కానీ, పోస్టు లో పెట్టిన వీడియో ఇంటర్నెట్ లో కనీసం మే 2019 నుండి ఉన్నట్లుగా తెలిసింది. కావున, ఇది ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వీడియో కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వినోద్ శర్మ అనే సీనియర్ జర్నలిస్ట్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను 15 మే 2019 లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియోని బీజేపీకి ముడిపెడుతూ 2019లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు. ఇటీవల బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 2021 లో జరిగాయి 2019 లో కాదు. 

ఆ వీడియోకు సంబంధించి సమాచారం కోసం వెతికినప్పుడు, ఒక న్యూస్ ఆర్టికల్ దొరికింది. ఈ ఆర్టికల్ కూడా 2019లోనే పబ్లిష్ అయిందే, 2021లో కాదు. ఈ ఆర్టికల్ లో ఆ వీడియో కచ్చితంగా ఎక్కడ తీసారో తెలియదు అని, కాని రూరల్ బెంగాల్ కు సంబంధించి అయి ఉండొచ్చని తెలిపారు. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో పార్లమెంట్ ఎన్నికలు-2019 సందర్భంలో జరిగినట్లుగా ‘Siasat Daily’ వార్తా సంస్థ పేర్కొన్నది. కానీ, అందుకు సంబంధించిన సమాచారం ఇంకెక్కడా లభించలేదు.

ఇదే వీడియోని 2019 హుజూర్ నగర్ బై ఎలక్షన్ కి ముడిపెడుతూ గతంలో షేర్ చేసినప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 2021లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ దృశ్యాలు అని కూడా ఇదే వీడియోని షేర్ చేసారు.

చివరగా, పాత వీడియో పెట్టి 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ దృశ్యాలు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll