Coronavirus Telugu, Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ కార్యాలయాల్లో చలానా కట్టి రెమెడెసివిర్ ఇంజక్షన్ పొందవచ్చన్న వార్తల్లో నిజం లేదు

0

‘కరోనా భారిన పడినవారు రేమిడిసివేర్ కోసం పాజిటివ్ రిపోర్ట్,ఆధార్,హాస్పటల్లో అడ్మిట్ అయిన లెటర్,డాక్టర్ ప్రిస్క్రిప్షన్, పట్టుకుని మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే వారు ఒక్కో ఇంజక్షన్ కి 2640/-(6×2640=15840) రూపాయలు చలానా కట్టించుకుని మనకి ఇవ్వడం జరుగుతుందని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ కార్యాలయంలో చలానా కట్టి రెమెడెసివిర్ పొందొచ్చు

ఫాక్ట్ (నిజం): ఇలా కలెక్టర్ కార్యాలయంలో చలానా కట్టి రెమెడెసివిర్ పొందొచ్చన్న వార్త ఫేక్ అని, కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే రెమెడెసివిర్ ఇంజక్షన్లు పొందొచ్చని చిత్తూర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. కలెక్టర్ కార్యాలయంలో రెమెడెసివిర్ పొందొచ్చని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ప్రభుత్వ సమాచారం గాని అందుబాటులో లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా ఇలా కలెక్టర్ కార్యాలయంలో చలానా కట్టి రెమెడెసివిర్ పొందోచ్చని చెప్పే వార్తా కథనాలు గాని లేక ప్రభుత్వ సమాచారం గాని మాకు లభించలేదు. ఐతే ఇదే వార్త (కలెక్టర్ కార్యాలయంలో ఒక్కో రెమెడెసివిర్ ఇంజక్షన్ కి రూ. 1300 చలానా కట్టి పొందవచ్చని) సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు చిత్తూర్ జిల్లా కలెక్టర్ ఈ వార్తకి సంబంధించి వివరణ ఇస్తూ ఇది ఫేక్ వార్త అని, రెమెడెసివిర్ ఇంజక్షన్ కేవలం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే దొరుకుతుందని ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.

వైరల్ అయిన వార్తకి సంబంధించి చిత్తూర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన వివరణను పలు వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. ఈ వార్తను ప్రచురించిన ఒక వార్తాకథనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేల నిజంగానే ఇలా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజలకి రెమెడెసివిర్ అందిస్తుంటే వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించేవి, కాని ఈ విషయాన్ని ద్రువీకరిస్తూ మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ కార్యాలయాల్లో చలానా కట్టి రెమెడెసివిర్ ఇంజక్షన్ పొందవచ్చన్న వార్తల్లో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll