Fake News, Telugu
 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శస్తూ ఈ ట్వీట్ చేసింది శశికళ యొక్క ఫ్యాన్ పేజి (పేరడీ) అకౌంట్

0

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ కి మద్దతుగా మాట్లాడినందుకు శశికళ విమర్శించారు అని ఒక సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చాలా మంది షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శస్తూ శశికళ చేసిన ట్వీట్.

ఫాక్ట్: జగన్ మోహన్ రెడ్డిని శశికళ విమర్శించినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు. దీనికి తోడు అసలు శశికళ పేరు మీద అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ఒక పేరడీ అకౌంట్ నుంచి చేసింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని శశికళ విమర్శించింది అని చెప్పటానికి మాకు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. అసలు పోస్ట్ లో పెట్టిన ట్విట్టర్ స్టేటస్ కు శశికళకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే అసలు శశికళ పేరు మీద ఎటువంటి అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. పై పోస్ట్ లో ఇమేజ్ లో ఉన్న ట్విట్టర్ పోస్ట్ ఒక పేరడీ అకౌంట్. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ట్వీట్ శశికళ ఫ్యాన్ పేజి పోస్ట్ చేసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల ప్రధాన మంత్రి ని ఉద్దేశించి ఒక ట్విట్టర్ పోస్ట్ చెయ్యడం జరిగింది. దానికి సంబంధించి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలియజేసారు. ఈ సంఘటన కు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇటువంటి కష్ట సమయంలో, కరోన మహమ్మారిని ఎదుర్కోవటానికి అందరు కలిసి ప్రధాన మంత్రికి తోడ్పడాలి అని జగన్ తన పోస్ట్ ద్వారా చెప్పారు.

చివరగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శస్తూ ఈ ట్వీట్ చేసింది శశికళ యొక్క ఫ్యాన్ పేజి (పేరడీ) అకౌంట్.

Share.

About Author

Comments are closed.

scroll