Fake News, Telugu
 

2018 నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని 2023 ఎన్నికల షెడ్యూల్ అని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2023 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ECI) విడుదల చేసిందని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. ఇదే విషయం గురించి T- న్యూస్ ఛానల్ వారి ఒక వీడియో రిపోర్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: భారత ఎన్నికల సంఘం తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలు 07 డిసెంబర్ 2023న నిర్వహించబడతాయి.

ఫాక్ట్ (నిజం): 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఇంకా విడుదల చేయలేదు. పైగా, వైరల్ మెసేజ్‌లో పేర్కొన్న తేదీలు 2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తేదీలు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

తెలంగాణ శాసనసభ కాలపరిమితి 2023 డిసెంబర్‌తో ముగియనుంది (ఇక్కడ, ఇక్కడ). 

వైరల్ అవుతున్న సందేశం వెనుక ఉన్న నిజానిజాల్ని తెలుసుకోవటానికి, అసలు భారత ఎన్నికల సంఘం 2023 అసెంబ్లీ ఎన్నికల యొక్క ముఖ్యమైన తేదీలు (నోటిఫికేషన్ తేదీ, పోల్ తేదీ మొదలైనవి), అధికారిక షెడ్యూల్‌ని విడుదల చేసిందో లేదో తనిఖీ చేయడానికి, మేము భారత ఎన్నికల సంఘం(ECI) యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసాము. తద్వారా, ECI ఇంకా తేదీలను విడుదల చేయాల్సి ఉందని తెలిసింది (ఇది కూడా చదవండి). 

అంతేకాకుండా, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న షెడ్యూల్ పాతదని మేము గుర్తించాము. ఇది 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్.

ఇంకా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న T- న్యూస్ ఛానల్ వారి వీడియో రిపోర్టు అక్టోబర్ 2018 నాటిది, దీని అసలు వెర్షన్ ‘T-News Telugu’ ఆఫీషీయల్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. 

చివరిగా, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు 2023 అసెంబ్లీ ఎన్నికలకి సంబందించినవి అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll