Fake News, Telugu
 

మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడట్లేదు

0

మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా అసాల్ట్ రైఫెల్ ఆయుధం ధరించి రష్యాతో యుద్ధం చేస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. రష్యాపై పోరాటం చేసేందుకు ఆసక్తి చూపే పౌరులకు ఆయుధాలు అందిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంతో చేరి రష్యా బలగాలతో పోరాడుతున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోని అనస్తాసియా లీనా 22 ఫిబ్రవరి 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అయితే, ఈ ఫోటో తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసినదని, ఈ ఫోటోని కేవలం ఉక్రెయిన్ ప్రజలలో స్పూర్తిని నింపడానికి పెట్టానని అనస్తాసియా లీనా మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సైన్యంలో చేరి తను రష్యాతో పోరాడుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని లీనా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.   

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా అధికారిక సోషల్ మీడియా హ్యండిల్స్‌లో వెతికితే, ఈ ఫోటోని అనస్తాసియా లీనా 22 ఫిబ్రవరి 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది.

అయితే, ఈ ఫోటోని తను కేవలం ఉక్రెయిన్ ప్రజలలో స్పూర్తి నింపడానికి పెట్టినట్టు అనస్తాసియా లీనా 01 మర్చి 2022 నాడు మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. అనస్తాసియా లీనా, తాను ఉక్రెయిన్ సైన్యంలో చేరలేదని, తను కేవలం ఉక్రెయిన్ దేశానికి చెందిన సామాన్య పౌరురాలు మాత్రమే అని ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. అంతేకాదు, తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ క్రిడాకారిణినని, ఈ ఫోటో తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసినదని అనస్తాసియా లీనా స్పష్టం చేసింది.

అనస్తాసియా లీనా ఈ ఫోటోకి సంబంధించి ఇచ్చిన స్పష్టతను పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యా బలగాలతో పోరాడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడలేదు; ఈ ఫోటో తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసినది.

Share.

About Author

Comments are closed.

scroll