Fake News, Telugu
 

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స యొక్క పాత ఫోటోను ఇటీవల జరిగిన సంఘటనదిగా షేర్ చేస్తున్నారు

0

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స యొక్క ఫోటోను షేర్ చేస్తూ, ఇటీవల శ్రీలంకలోని పరిస్థితిగా ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల తీసిన శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స యొక్క ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో 2004లో శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స వెలి ఓయాలోని మిలిటరీ ఫ్రంట్‌లైన్‌ను సందర్శించినప్పుడు తీసింది; ఇటీవల తీసింది కాదు. 2004లో శ్రీలంక ఇంకా అంతర్యుద్ధంలోనే ఉండేది. ముల్లైతీవు జిల్లాలో ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతంలో లిబరేషన్ టైగర్స్ మరియు శ్రీలంక ప్రభుత్వం తలపడటానికి రెడీగా ఉన్నప్పుడు, ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్స్‌పై రక్షణను ఆయన ఇలా తనిఖీ చేశాడు. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల మధ్య ప్రధానమంత్రి పదవికి రాజపక్స రాజీనామా చేయవలసి వచ్చింది, తర్వాత భద్రతతో నౌకాదళ శిబిరంలో ఆశ్రయం పొందాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటోతో ఉన్న 2004 ఆర్టికల్ ఒకటి లభించింది. ఈ ఆర్టికల్‌లోని సమాచారం ప్రకారం, అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స వెలి ఓయాలోని మిలిటరీ ఫ్రంట్‌లైన్‌ను 2004లో సందర్శించారు. 2004లో శ్రీలంక ఇంకా అంతర్యుద్ధంలోనే ఉండేది. ముల్లైతీవు జిల్లాలో ఉన్న ఒక వివాదాస్పద ప్రాంతంలో లిబరేషన్ టైగర్స్ మరియు శ్రీలంక ప్రభుత్వం తలపడటానికి రెడీగా ఉన్నప్పుడు, ఫార్వర్డ్ డిఫెన్స్ లైన్స్‌పై రక్షణను ఆయన తనిఖీ చేశారు. అప్పుడు తీసిన ఫోటో ఇది, ఇటీవల తీసింది కాదు.

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స ఇటీవల రాజీనామా చేసిన తర్వాత 18 మే 2022న పార్లమెంటులో మొదటిసారిగా కనిపించారు. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల మధ్య అతను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది, తర్వాత అధిక భద్రతతో నౌకాదళ శిబిరంలో ఆశ్రయం పొందాడు. గతంలో మూడుసార్లు దేశ ప్రధానిగా 76 ఏళ్ల మహింద రాజపక్స చేసారు. గత వారం తన నివాసానికి నిప్పు పెట్టారు. తన భార్య మరియు కుటుంబంతో సహా, తన అధికారిక నివాసం – టెంపుల్ ట్రీస్ ఖాళీ చేసి ట్రింకోమలీలోని నౌకాదళ స్థావరంలో ఆశ్రయం పొందాడు.

చివరగా, శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్స యొక్క పాత ఫోటోను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll