కర్నాటకలో జైన సన్యాసిపై ముస్లింలు దాడి చేసారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ వార్తతో పాటు ఒక జైన్ సన్యాసి గాయాలతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో జైన సన్యాసి మయాంక్ సాగర్‌పై ముస్లింలు దాడి చేసి గాయపరిచిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఇది జైన సన్యాసి మయాంక్ సాగర్ 2018లో ఒక ప్రమాదంలో గాయపడ్డప్పటి ఫోటో. ఐతే ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. గతంలో ఈ ఫోటోను మతాల మధ్య గొడవలు సృష్టించేలా షేర్ చేసినందుకు పోలీసులు పలు వెబ్‌సైట్‌ల ఎడిటర్‌లను అరెస్ట్ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 2018లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ ఫొటోలోని వ్యక్తి జైన సన్యాసి ‘ఉపాధ్యాయ మయాంక్ సాగర్‌జీ మహారాజ్’.
మార్చ్ 2018లో ఈ జైన్ ముని కర్ణాటకలోని శ్రావణబెళగొళ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొని భుజానికి గాయమైంది. ఐతే కొన్ని వెబ్‌సైట్‌లు ఈ వార్తను మతాలను రెచ్చగొట్టేలా షేర్ చేయడంతో బెంగళూరు పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు ఈ కథనాలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). జైన సన్యాసి మయాంక్ సాగర్‌పై ముస్లింలు దాడి చేసారు అంటూ వార్తలు రాయడంతో, రెండు మతాలను రెచ్చగొట్టేలా సమాచారాన్ని షేర్ చేస్తున్నారన్న కారణానికి ఈ వెబ్‌సైట్‌లపై పలు IT సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్టు ఈ కథనాల సారాంశం.
ఈ కథనాల ఆధారంగా జైన్ ముని ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్స్ కోసం వెతకగా జైన్ ముని ప్రమాదంలో గాయపడ్డ వార్తను షేర్ చేసిన ఒక బ్లాగ్ మాకు కనిపించింది. ఈ బ్లాగ్ కూడా జైన్ ముని ప్రమాదంలో గాయపడ్డట్టు తెలిపింది.
చివరగా, జైన సన్యాసి మయాంక్ సాగర్ గతంలో ప్రమాదంలో గాయపడ్డ ఫోటోను ఆయనపై ముస్లింలు దాడి చేసారంటూ షేర్ చేస్తున్నారు