Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందుకు పోలీసులు డ్యాన్స్ చేస్తున్నారని అంటున్నారు

0

పోలీస్ అధికారులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఆనందంతో పోలీస్ అధికారులు డాన్స్ చేస్తున్నారంటూ రాస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఆనందంతో పోలీస్ అధికారులు డ్యాన్స్ చేస్తున్న వీడియో

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఆగస్ట్ 2023 నుండి, అంటే తెలంగాణలో ఎన్నికల ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.  అసలు వీడియోలో వినిపించే పంజాబీ పాటను వైరల్ వీడియోలో తెలుగు పాటతో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఆగస్ట్ 2023 నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్టు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

అయితే, మాకు ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు (సందర్భం ఇతర వివరాలు) లభించలేదు. ఇది ఎన్నికల ముందునుంచే  సోషల్ మీడియాలో  “పోలీస్ అధికారులు పగలు, రాత్రి డ్యూటీ తర్వాత కొద్ది క్షణాలు డ్యాన్స్‌ని ఆస్వాదిస్తున్నారు” అంటూ షేర్ చేస్తున్నట్టు గమనించాం. పైగా, వీడియోలో వినిపించే పంజాబీ పాటను వైరల్ వీడియోలో తెలుగు పాటను ఉపయోగించి ఎడిట్ చేస్తూ షేర్చేస్తున్నారు.

చివరిగా, పాత వీడియోను ఎడిట్ చేసి షేర్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి  రావటంతో పోలీసులు డ్యాన్స్ చేస్తున్నారని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll