Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వేరే దేశం వీడియో పెట్టి, ‘కొరోనా వచ్చిన కరీంనగర్ వ్యక్తి పరిస్థితి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇండోనేషియా నుండి వచ్చిన వాళ్ళతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి కరోన రావడం తో హాస్పిటల్ లో తన పరిస్థితి చూడండి’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరీంనగర్ వ్యక్తికి కరోన రావడం తో హాస్పిటల్ లో తన పరిస్థితి చూడండి.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో అసలు భారత దేశానికి సంబంధించింది కాదు. ఆ వీడియో ఈక్వడార్ లో తీసినట్టు ఈక్వడార్ కి చెందిన ఒక డాక్టర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని 18 మార్చ్ రోజు ఈక్వడార్ కి చెందిన ఒక డాక్టర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు చూడొచ్చు. ఆ ట్వీట్ కింద ఆ ఘటనకి సంబంధించిన మరిన్ని వీడియోలు పోస్ట్ చేసింది. ఆ వీడియోని ఈక్వడార్ లో తీసినట్టు తన ట్వీట్ల ద్వారా తెలుస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

పైన పెట్టిన ట్వీట్ లో ‘COVID19’ అని టాగ్ చేసినా, అతను శ్వాసకోశ ఉపసంహరణ లక్షణాలతో బాధ పడుతున్నాడని ఆ డాక్టర్ పేర్కొంది. ‘C6 Television’ అనే ఫేస్బుక్ పేజీ కూడా వీడియోలోని వ్యక్తికి ఉన్నది కరోనా వైరస్ కాదని పేర్కొన్నారు.

20 మార్చ్ రోజు యూట్యూబ్ లో పెట్టిన ఇదే వీడియో బ్రెజిల్ కి సంబందించినది అని ఇంకొందరు పేర్కొన్నారు. వీడియోలో మాట్లాడే బాష కూడా మన రాష్ట్రంలో మాట్లాడే బాషలా ఉండదు.

చివరగా, వేరే దేశంలో తీసిన వీడియో పెట్టి, ‘కొరోనా వచ్చిన కరీంనగర్ వ్యక్తి పరిస్థితి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll