Fake News, Telugu
 

రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లను డబ్బుల కోసం బెదిరించిన ఆడియో లీక్ అయిందంటూ షేర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి వార్త కథనం ఫేక్

0

ఒక న్యూస్ పేపర్ క్లిప్ పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి లీక్ అయిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఆ ఫోన్ కాల్లో రేవంత్ రెడ్డి, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ తానే  కాబోయే సీఎం అని, రెండ్రోజుల్లో చెప్పిన నాయకులకు డబ్బులు పంపకపోతే కేసులు పెడతానని హెచ్చరించాడని, ఇది ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త కథనం అంటూ షేర్ చేస్తున్నారు.  దీని వెనుక ఉన్న వాస్తవం ఇప్పుడు చూద్దాం.

 క్లెయిమ్: రేవంత్ రెడ్డి, కాబోయే సీఎం తానేనని, రెండ్రోజుల్లో డబ్బులు పంపకపోతే కేసులు పెడతానని కాంట్రాక్టర్లను ఫోన్లో బెదిరించిన లీక్ అయిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటూ ఆంధ్రజ్యోతి ఎలక్షన్ స్పెషల్లో ప్రచురించింది.

ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులోని కథనాన్ని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చెయ్యలేదు. ABN ఆంధ్రజ్యోతి సోషల్ మీడియా ద్వారా ఈ కథనం ఫేక్ అని స్పష్టం చేసింది. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన కథనాన్ని ‘ABN ఆంధ్రజ్యోతి’’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిందా లేదా అని తెలుసుకునేందుకు వారి వెబ్సైటులో వెతికితే, రేవంత్ రెడ్డికి సంబంధించి అటువంటి వార్తా కథనమేదీ ‘ABN ఆంధ్రజ్యోతి’ పబ్లిష్ చేయలేదని తెలిసింది.

ABN ఆంధ్రజ్యోతి సోషల్ మీడియా ద్వారా, “ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోబడును” అంటూ, ఈ కథనం ఫేక్ అని స్పష్టం చేసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ)

చివరిగా, రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లను డబ్బుల కోసం బెదిరించిన ఆడియో లీక్ అయిందంటూ షేర్ చేస్తున్న ABN ఆంధ్రజ్యోతి వార్త కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll