Fake News, Telugu
 

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇస్లాం మతం స్వీకరించాడు అనే తప్పుడు కథనం చెప్తూ సంబంధంలేని ఫోటోని షేర్ చేస్తున్నారు.

0

చందమామపై దిగిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై “అజా” శబ్దం విని ఇస్లాం స్వీకరించాడు అని చెప్తూ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ astronaut దుస్తుల్లో ఉన్న ఫోటో మరియు ఒక సాంప్రదాయిక ఇస్లాం దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ఫోటో (దీన్ని నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫోటో అని చెప్తుతున్నారు) కలిగిన ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వేనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్:  నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై “అజా” శబ్దం విని ఇస్లాం మతానికి మారాడు. 

ఫాక్ట్(నిజం): వైరల్ పోస్టులో వ్యోమగామి దుస్తుల్లో ఉన్న వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నది నిజమే కానీ ఇస్లామిక్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి మాత్రం తను కాదు. అతని పేరు పియర్ వోగెల్, అతను ఒక ఇస్లామిక్ బోధకుడు, మాజీ బాక్సర్. వాషింగ్టన్ పోస్ట్ వారి ఒక కథనం, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవిత చరిత్ర ప్రకారం, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎప్పుడూ ఇస్లాంలోకి మారలేదు. తను ఈ పుకార్లని తిరస్కరిస్తూ అనేక దేశాల రాయబార కార్యాలయాలకు లేఖలు కూడా పంపాడు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

మొదటగా, ఈ క్లెయిమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ది వాషింగ్టన్ పోస్ట్ కథనానికి దారి తీసింది. ‘The false, but persistent, rumor that Neil Armstrong converted to Islam’ అనే శీర్షికతో ఉన్న ఈ 2018 కథనం ఆర్మ్‌స్ట్రాంగ్ మత మార్పిడి వాదన ఒక చాలా పాత బూటకం (Hoax) అని పేర్కొంది. ఆర్మ్‌స్ట్రాంగ్ జీవిత చరిత్రని Quote చేస్తూ : “So many people identify with the success of Apollo. The claim about my becoming a Muslim is just an extreme version of people inevitably telling me they know somebody whom I might know.” అని ది వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనంలో పేర్కొంది.

ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఈ పుకారుని తిరస్కరిస్తూ పలు రాయబార కార్యాలయాలకి, కాన్సులేట్‌లకు లేఖలు పంపినట్లు కథనాలు ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఇదే క్లెయిమ్‌ను గతంలో BBC కూడా తప్పుడు సమాచారం అని చెప్తూ debunk  చేసింది.

వైరల్ పోస్టులో ఇస్లామిక్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఎవరు అని ఆ ఫోటోని ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా. ఇతను ఒక మాజీ బాక్సర్ పియర్ వోగెల్ అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). 

ఇతను ఒక ఇస్లాం మత బోధకుడు. తన యూట్యూబ్ ఛానెల్లో ఉన్న ఒక వీడియోలో స్క్రీంషాట్ ఉపయోగించి, ఇందులో ఉన్నది ఇస్లాం మతం పుచ్చుకున్న నీల్ అర్ట్మస్ట్రాంగ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

చివరిగా, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇస్లాం మతం స్వీకరించలేదు, ఇది ఫేక్ వార్త.

Share.

About Author

Comments are closed.

scroll