Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫైజర్, మాడెర్నా కోవిడ్-19 టీకాలలో పంది కొవ్వు లేదు

0

కోవిడ్-19 టీకాలో పోర్క్ (పంది) ద్వారా ఉత్పన్నమైన  జెలటిన్ మరియు కొవ్వు ఉన్నందున ఇప్పుడు ఇస్లాం మత పెద్దలు ఎం చేస్తారో చేస్తారో అని ఒక పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పోర్క్ పదార్థాలను వాడటం ఇస్లాం మత చట్ట ప్రకారం నిషేధమని మనకు తెలిసిందే. ఈ పోస్టులో ఎంత వరకు నిజం ఉందో  ఇప్పుడు చూద్దాం

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 టీకాలో పోర్క్ (పంది) కొవ్వు ద్వారా చేసే జెలటిన్ వాడారు.

ఫాక్ట్ (నిజం): ఫైజర్, మాడెర్నా కోవిడ్-19 టీకాలో పంది కొవ్వు లేదు. ఆ సంస్థలు చేసిన టీకాలో ఉన్న పదార్థాలు లిస్ట్ లో పండి కొవ్వు లేదు. రెండు కంపెనీల ప్రతినిధులు కూడా తాము ఎటువంటి పోర్క్ ఉత్పత్తులు కోవిడ్-19 టీకాలో వాడలేదని పేర్కొన్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

అసలు టీకాలు ఎందుకు వాడతారు?

టీకాలు శరీరంలో ప్రతిరోధకాలను (యాంటీ బాడీస్) ఉత్తేజపరిచే పదార్థాలు. ఇవి రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. సాధారణంగా పంది నుండి ఉత్పన్నమైన జెలటిన్, వాక్సిన్ల స్టెబిలైజర్, అంటే ఆ వాక్సిన్ యొక్క స్థిర ఉష్ణోగ్రత ఉంచి జీవిత కాలం పెంచడానికి, భద్రత మరియు సమర్ధతను నిర్ధారించడానికి ఉపయోగించబడతాయి. ఇలా ఇంతకు  ముందు యూకే లో ఇచ్చిన ఫ్లూ, ఎంఎంఆర్ వాక్స్ ప్రో, జొస్టావాక్స్ మరియు వారివాక్స్ లో పంది జెలటిన్ ను వాడారు.

కోవిడ్-19 టీకాలో కూడా పంది కొవ్వు వాడారా?

ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారిని ఎదురుకుంటున్నప్పటికీ, కోవిడ్-19 టీకాలో పోర్క్ (పంది) జెలటిన్ ఉందన్న పుకారు ఇస్లాం దేశాల్లో సంచలనం సృష్టిచింది. WHO సంస్థ ప్రకారం ఇప్పటి వరకు 172 వాక్సిన్లు  ప్రీ క్లినికల్ స్టేజి వద్ద ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే అత్యవసర ఆమోదం పొందాయి. ఇలా ఆమోదం పొందిన వాటిలో ఫైజర్, మాడెర్నా కోవిడ్-19 టీకాలు ముఖ్యమైనవి. ఆ కంపెనీల ప్రతినిధులు తాము పోర్క్ (పంది) జెలటిన్ వాడలేదని పేర్కొన్నారు. ఇదే విషయం తెలుపుతూ AP న్యూస్ మరియు ఇండియా టీవీ  రిపోర్ట్ చేసిన వార్తల్ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అంతే కాదు, టీకా ఆమోదం కోసం ఈ కంపెనీలు FDA వారికి సమర్పించిన పదార్థాలు లిస్ట్ లో కూడా పోర్క్ (పంది) జెలటిన్ లేదు. FDA వారి వెబ్సైటు లో ఫైజర్ మరియు మాడెర్నా టీకాలో వాడిన పదార్థాల లిస్ట్ కూడా ఉంది. అందులో ఎక్కడా కూడా పోర్క్ (పంది) జెలటిన్ లేదు.

ఇలా టీకాలలో పోర్క్ (పంది) జెలటిన్ మీద చర్చ ఇది మొదటి సారి కాదు. 2018 లో ఇండోనేషియా యులేమా (స్కాలర్స్)  కౌన్సిల్, వారి దేశంలోని అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ పంది జెలటిన్ ఉందన్న కారణంగా  మీజిల్స్ రుబెల్లా టీకాను హరామ్ గా ప్రకటించారు. దీని వల్ల, ప్రపంచంలోనే అత్యధిక మీజిల్స్ కేసులు ఇండోనేషియా లో నమోదు అయ్యాయని WHO చెప్పింది.

ఇదే కాకుండా, మొన్న భారత దేశంలోని తొమ్మిది ముస్లిం సంస్థల వారు ముంబైలో కలిసి నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం రిపోర్టులో వస్తున్నట్టు పంది జెలటిన్ కల  చైనా కోవిడ్-19 టీకా ‘సినోవాక్’ ముస్లింలకు ఇవ్వరాదు అని Raza అకాడెమి సెక్రటరీ-జనరల్  తెలిపారు- “ఇస్లాం లో పంది హరామ్, అది ఉపయోగించే వాక్సిన్ కూడా హరామ్ అవుతుంది కావున ఈ వాక్సిన్ను అనుమతించరాదు”, అని అయన పేర్కొన్నారు.

ఇదే సందర్భంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ కరోనా వైరస్ టీకాను ముస్లింలకు ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. యూఏఈ ఫత్వా కౌన్సిల్ చైర్మన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ టీకాలు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావని పేర్కొన్నారు. వేరే ప్రత్యామ్నాయాలు లేనందున, ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో టీకా మీద హరాం అని అనుమానమున్నా ఔషధంగా పరిగణించాలని అన్నారు.

చివరిగా, ఇప్పటి వరకు ఆమోదించిన ముఖ్యమైన కోవిడ్-19 టీకాలైన ఫైజర్, మాడెర్నా సంస్థలు తయారు చేసిన టీకాలలో పోర్క్ జెలటిన్ లేదు. మిగతా టీకాల సంగతి ఇంకా తెలియక పొయినా, ఈ రెండిట్లో మాత్రం పోర్క్ జెలటిన్ లేదు.

Share.

About Author

Comments are closed.

scroll